నవాబ్ చిత్రం చూసి మహేష్ బాబు ఏమన్నాడో చూడండి

211

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ మూవీ నవాబ్.అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తెలుగు తమిళ్ లో విజయం దక్కించుకుంది.ఎందరో సినీ ప్రముఖులు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కొనియాడారు.

ఇటీవల మంచి టాక్ తో దూసుకుపోతున్న ప్రతి చిత్రానికి ప్రోత్సాహం అందిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాల గురించి మహేష్ ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నవాబ్ చిత్రం మహేష్ ట్వీట్ చేశాడు.దర్శకుడు మణిరత్నంని ప్రశంసలతో ముంచెత్తాడు.‘‘నవాబ్‌’ నటీనటుల అద్భుతమైన ప్రదర్శన. ఎ.ఆర్‌. రెహమాన్‌ మీకు సాటిలేరు. సంతోష్‌ శివాన్‌.. క్లాస్‌ చిత్రాన్ని ఇచ్చారు.

మణిరత్నం అభిమానిగా ఆయన సినిమాల్ని చెన్నై థియేటర్‌లో చూసి క్లాప్స్‌‌ కొట్టేవాడ్ని. ఇప్పుడు అదే చేశా.. సినిమాను నా హోమ్‌ థియేటర్‌లో కాలర్‌ ఎగరేసుకుని చూశా. ఇప్పటి వరకు మీరు సినిమా చూడకపోయి ఉంటే.. వెళ్లి టికెట్లు దక్కించుకోండి. ఇది ఓ క్లాసిక్‌ సినిమా. దశాబ్దానికి ఓ సారి వచ్చే చిత్రమిది. ది మాస్టర్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని మహేశ్‌ ట్వీట్లు చేశారు.