రజినీతో మహేష్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్..ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకేసారి?

266

సూపర్ స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట మహేష్ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు.ఈ మల్టీప్లెక్స్‌ను ఇప్పటికే ప్రారంభించాల్సింది. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలని మహేష్‌బాబు అనుకున్నారు.అయితే అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో కుదరలేదు.

Related image

అయితే ఇప్పుడు పనులన్నీ పూర్తీ అయ్యాయి.దాంతో ఓపెన్ చెయ్యడానికి సిద్దమయ్యింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘2.ఓ’ సినిమాతో ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను మహేష్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. నవంబర్ 29న విడుదలవుతోన్న ఈ సినిమాతోనే మల్టీప్లెక్స్‌ ప్రారంభమవుతోందనే వార్త బలంగా వినిపిస్తోంది.

Related image

అంతేకాకుండా ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రజినీకాంత్‌ స్వయంగా హాజరవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒక వేళ ఇదే గనుక నిజమైతే ఇద్దరు సూపర్ స్టార్స్ ను ఒకేసారి చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.