మహేష్ మల్టీప్లెక్స్ ఇంధ్రభవనాన్ని తలపించేలా ఉంది.. కేక పుట్టిస్తున్న పిక్చర్స్

431

సూపర్ స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట మహేష్ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు.హైదరాబాద్‌లో నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌లో ఏడు స్క్రీన్లు ఉంటాయి. ఒకేసారి 1638 మంది కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలనే కుతుహలం ప్రేక్షకుల్లో పెరిగింది. గ్రాండ్ ఆడిటోరియంలో ఏడు స్క్రీన్లను అత్యున్నత సాంకేతికతతో రూపొందించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో

3డీ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందించే విధంగా నిర్మించారు. ఏఎంబీ సినిమాస్‌లో చూసే ప్రతీ ప్రేక్షకుడికి అన్ని విధాలా చక్కటి అనుభూతిని కలుగజేయడం ఖాయం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మల్టిప్లెక్స్ నిర్మించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఏఎంబీ సినిమాస్‌ను సందర్శించే ప్రేక్షకులకు వివేషంగా ఆకట్టుకునే విధంగా ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు.

ఇంధ్రభవనాన్ని తలపించేలా

ఇంధ్రభవనాన్ని తలపించే విధంగా లైటింగ్, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ థియేటర్లను నవంబర్ 29న ఆవిష్కరించనున్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో శంకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 2.O చిత్రం రిలీజ్ కానున్నది.