మహేష్ బాబు మహర్షి సెకండ్ లుక్ రిలీజ్..

252

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.పూజాహెగ్డే హీరోయిన్. దిల్ రాజు ప్రసాద్ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

Image result for maharshi

మహేష్ కోసం వంశీ తిరుగులేని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మహర్షి చిత్రంలో మహేష్ పాత్ర గురించి వస్తున్న వార్తలు అంచనాలు భారీగా పెంచేలా ఉన్నాయి.ఈ చిత్రంలో మహేష్ బాబు ఐదు విభిన్న రూపాల్లో నట విశ్వరూపం ప్రదరించబోతున్నాడని సమాచారం. కాలేజీ రోజుల నుంచి మొదలు పెడితే కంపెనీ అధినేతగా ఎదిగేవరకు మహేష్ విభిన్నమైన లుక్స్ లో అలరిస్తాడట.

Image result for maharshi second look

అయితే ఇప్పటికే విడుదల చేసిన కాలేజ్ లుక్ చాలా బాగుంది. అయితే న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఇప్పుడు మహర్షి నుంచి మరొక లుక్ ను విడుదల చేశారు.సెకండ్ లుక్ చూస్తుంటే బిజినెస్ మ్యాన్ అవతారంలా ఉంది. చాలా స్టైల్ గా ఈ లుక్ ఉంది.