భారీ ధరకు అమ్ముడుపోయిన ‘మహర్షి’ శాటిలైట్ రైట్స్!

275

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.పూజాహెగ్డే హీరోయిన్. దిల్ రాజు ప్రసాద్ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ కోసం వంశీ తిరుగులేని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మహర్షి చిత్రంలో మహేష్ పాత్ర గురించి వస్తున్న వార్తలు అంచనాలు భారీగా పెంచేలా ఉన్నాయి.

Image result for maharishi mahesh babu

ఈ చిత్రంలో మహేష్ బాబు ఐదు విభిన్న రూపాల్లో నట విశ్వరూపం ప్రదరించబోతున్నాడని సమాచారం.అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఏకంగా ఒక విలేజిని నిర్మించారు.ఈ మధ్యనే ఈ సెట్‌లో షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు సమాచారం.వచ్చే సంవత్సరం ఈ చిత్రం విడుదల అవుతుంది.

Image result for maharishi mahesh babu

అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరిందరని ఫిలింనగర్ టాక్. ‘మహర్షి’ హిందీ శాటిలైట్ హక్కులకు దిల్ రాజు రూ.25 కోట్లకు అమ్మేందుకు సిద్ధపడ్డారట. అయితే ఒక సంస్థ రూ.20 కోట్లు చెల్లించేందుకు సిద్ధమవడంతో ఆయన ఆ డీల్ ను ఓకే చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.