మ‌హ‌ర్షిగా మ‌హేష్ బాబు

323

టైటిల్ ఏదైనా స్టోరీ ఏదైనా మ‌హేష్ బాబు సినిమాలు అంటే క్రేజ్ విప‌రీతంగా ఉంటుంది….. ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న 25 వ సినిమా సెట్స్ పై పెట్టారు.. ముగ్గురు బ‌డా నిర్మాత‌ల‌తో క‌లిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు…వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ గ‌తంలో ఇచ్చిన క‌మిట్ మెంట్ ప్ర‌కారం స్టోరీ న‌చ్చ‌డంతో ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు… ఇక మ‌హేష్ బాబు సినిమాలు స‌గం షూటింగ్ అయిపోయినా టైటిల్స్ పై ఎటువంటి ప్ర‌క‌ట‌న రివీల్ కాదు.. ఇప్పుడు కూడా అటువంటి డైల‌మా సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు పెరిగిపోయింది..

Image result for mahesh new movie stills 25

కాని ఈ సినిమా గురించి షూటింగ్ ప్రారంభం కాక‌ముందు నుంచి ఓ టైటిల్ అనుకుంటున్నారు… ఈ టైటిల్ మ‌హ‌ర్షి.. అదే సినిమా టైటిల్ అయి ఉంటుంది అని అంద‌రూ భావిస్తున్నారు.. ఇక ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుంది అని మీరు భావిస్తున్నారు.. స‌ర‌దాగా గెస్ చేయండి అంటూ చిత్రబృందం ఆర్‌.ఐ.ఎస్‌.హెచ్‌. ఇలా.. అక్షరాలు మాత్రమే రివీల్‌ చేసింది.

Image result for mahesh new movie stills 25

అయితే సినిమా టైటిల్ పై ఫ్యాన్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేశారు..రిషిని కలవండి.. తన ప్రయాణంలో ఈ నెల 9నుంచి మీరూ భాగస్వాములు అవ్వాలి అని చిత్రబృందం తెలియ‌చేసింది. ఇక సినిమాలో రిషి ఆయ‌న చేసే పాత్ర అనేది తెలిసింది.. ఇక 24 గంట‌ల్లో ఆ టైటిల్ పై క్లారిటీ రానుంది.