త‌మిళ్ లో మ‌హేష్ బాబు సినిమా

328

అవును ప్రిన్స్ మ‌హేష్ బాబు సినిమా ఇప్ప‌డు తమిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది.. ఇంత‌కీ ఏ సినిమా అని అనుకుంటున్నారా… తెలుగులో సూప‌ర్ స్టార్ ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం బ్రహ్మోత్సవం. ఈ సినిమాలో ప్రిన్స్ తో పాటు స‌మంత‌ కాజ‌ల్ ప్ర‌ణీత క‌లిసి న‌టించారు.. ఇక ఈ సినిమా సితార ఎంట‌ర్ టైన‌ర్ సంస్ధ స‌మ‌ర్ప‌ణ‌లో స్వాతి, వర్షిణి భద్రకాళి ఫిలింస్‌ పతాకంపై భద్రకాళి ప్రసాద్‌ తమిళంలోకి అనిరుధ్‌ పేరుతో అనువదించారు..

Image may contain: 2 people, people smiling, people sitting and indoor

ఈ సినిమా ఇప్పుడు తెలుగు నుంచి త‌మిళ‌ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో ఇప్పుడుఅక్క‌డ కూడా మ‌హేష్ అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్ అని అంటున్నారు ఫ్యాన్స్ .. ప్ర‌సాద్ ఇంతకుముందు సెల్వందన్, ప్రభాస్‌ బాహుబలి, ఇదుదాండా పోలీసు, మగధీర, బ్రూస్‌లీ, ఎవండు వంటి భారీ చిత్రాలను తమిళంలోకి అనువదించారు.

Image may contain: 1 person, shoes, child and outdoor

ఈ సినిమాకి తమిళ్ లో అనిరుధ్ అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు.. ఈ చిత్రం కోలీవుడ్ తెర‌పై ఆగ‌స్టు 3న రానుంది అని తెలుస్తోంది. ఏఆర్‌కే రాజా అనువాద రచన చేసిన ఈ చిత్రానికి అడ్డాల వెంకటాద్రి, సత్యసీతలన్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్ప‌టికే మార్కెట్లో ఈ చిత్ర పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని కుటుంబ విలువ‌లు క‌లిగిన సినిమాగా మంచి పేరు వ‌స్తుంది అని భావిస్తున్న‌ట్లు వారు ఆశాభావం తెలియ‌చేశారు.