150 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి శభాష్ అనిపించుకున్న మహేష్ బాబు..

269

సమాజ సేవ చేయడంలో మన హీరోలు ఎప్పుడు ముందుటారు.అందులో ముఖ్యంగా హీరో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఆయన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, నల్గొండ జిల్లాలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

Related image

అక్కడ ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన ఏర్పాటుచేసిన వైద్య శిబిరాల వల్ల ఇప్పటివరకు 150 మంది చిన్నారుల ప్రాణాలు నిలిచాయి. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రతా తన ‘ఇంస్టాగ్రామ్’ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

‘‘చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్ మాతో కలిసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు 150 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం సంతోషం కలిగిస్తోంది. చిన్నారుల గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సహకరించిన యూకే వైద్య బృందానికి ధన్యవాదాలు’’ అని నమ్రతా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల కుటుంబాలతో పాటు ఉన్న వైద్య బృందం ఫొటోలను పోస్ట్ చేశారు.