పల్లెటూరులో షూటింగ్ అంటే భయపడిపోతున్న మహేశ్ బాబు..ఎందుకో చూడండి..

666

సినిమా షూటింగ్‌లు విదేశాల్లో చెయ్యాల్సి వస్తే చాలామంది హీరోహీరోయిన్లు హ్యాపీగా ఫీల్ అవుతారుకొందరు పల్లెటూర్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు.కానీ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం పల్లెటూరులో షూటింగ్ అంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం 25వ సినిమాలో బిజీగా ఉన్నారు మహేష్ బాబు.ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.

ఇప్పటికే డెహ్రాడూన్‌లో సినిమా షూటింగ్ పూర్తయ్యింది.అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యుల్ ఒక విలేజిలో ఉండాలంట.కానీ మహేష్ బాబు వద్దంటూన్నాడంటా.కారణం గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంతలు తూర్పుగోదావరి జిల్లాలో సినిమా షూటింగ్‌లో పాల్గొని అనారోగ్యం పాలయ్యారట. అంతేకాదు మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమాలో ఒక గ్రామంలో నటించి కొన్నిరోజుల పాటు అక్కడే ఉండడంతో అనారోగ్యానికి గురయ్యారట.

ఆ దెబ్బతో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి మహేష్ బాబుకు ఏర్పడిందట. అందుకే గ్రామంలో షూటింగ్ అంటేనే మహేష్ బాబు భయపడిపోతున్నారట. దీంతో మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లోని సెట్టింగ్స్ వేస్తున్నారట దర్శకులు.నిర్మాతల బాగు కోరుకునే మహేష్ ఇలా ఒక ఊరి సెట్టింగ్ వెయ్యమని చెప్పి నిర్మాతకు ఎక్కువ ఖర్చు అయ్యేలా చేస్తున్నాడా అని అభిమానులు విస్తుపోతున్నారు.