చిన్నారి ప్రాణాలు కాపాడ‌టానికి మ‌హేష్ బాబు చేసిన ప‌ని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

309

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఆయ‌న దాన ద‌ర్మాలు చేయ‌డం, పేద‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందించ‌డంలో శ్రీమంతుడుగా ఆయ‌న్ని చెబుతారు, ఎవ‌రైనా సాయం కోసం మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తే కాదు అన‌కుండా వారికి సాయం చేస్తారు మ‌హేష్ బాబు, ఇక ఇప్ప‌టికే ప‌లుచోట్ల ఆయ‌న హెల్త్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నారు ,పేద విద్యార్దుల చ‌దువుకి కూడా ఆయ‌న ల‌క్ష‌ల రూపాయ‌లు ఖర్చు చేస్తున్నారు.

Image result for mahesh babu
కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనీష్ అనే చిన్నారికి శస్త్ర చికిత్స చేసేందుకు భారీ మొత్తాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నాడు మహేష్. ట్రీట్ మెంట్ తర్వాత 2017 ఆగస్ట్ లో చిన్నారి ఫ్యామిలీ మొత్తం మహేష్ ని కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలిపి ఫోటోలు కూడా దిగారు. ఇక ఇప్పుడు కూడా మ‌హేష్ మ‌రో అమ్మాయికి ఇలా చేయూత‌ని అందించారు, బెంగ‌ళూరుకి చెందిన శిల్పా అనే అమ్మాయి వెన్న‌ముక వ్యాధితో బాధ‌ప‌డుతోంది.. ఈ విష‌యం వారు మ‌హేష్ బాబు అభిమానుల‌కు తెలియ‌చేశారు. అలాగే ఇలా మ‌హేష్ సాయం చేసేంందుకు స్పెష‌ల్ టీంల‌ని ఏర్పాటు చేసుకున్నారు. వారు వెంటనే ఈ విష‌యం మ‌హేష్ కు తెలియ‌చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో మ‌హేష్ బాబు ఆ పాప కుటుంబంతో మాట్లాడారు ..వెంట‌నే పాప‌కు ఆప‌రేష‌న్ చేయించండి అని అన్నారు, దానికి కావ‌ల‌సిన 9 ల‌క్ష‌ల రూపాయ‌లు నేను ఇస్తాను అని ఆయ‌న హామీ ఇచ్చారు ..ఆ వెంట‌నే ఆచిన్నారి ఇంటికి మ‌హేష్ టీం వెళ్లింది. ఆమెని ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. దీంతో మ‌హేష్ కూడా ఆనందంలోఉన్నారు. ఇలాంటి వారికి వెంట‌నే చికిత్స అందించిడం ద్వారా వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతాం అని అన్నారు వైద్యులు. ఇలా మహేష్ ఆమెకు చికిత్స చేయించ‌డమే కాదు ఆమె చ‌దువుకి ఎంద ఖ‌ర్చు అయినా తానే చ‌దివిస్తాను అని , అలాగే ఆమెకు ఉద్యోగం వ‌చ్చేవ‌ర‌కూ చూసుకుంటా అని మ‌హేష్ హామీ ఇచ్చార‌ట… మ‌రి ఇప్పుడు మ‌హేష్ చేసిన పనికి అంద‌రూ కూడా ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నారు.. మ‌రోసారి మ‌హేష్ బాబు త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు అని కితాబిస్తున్నారు. మ‌రి మ‌హేష్ బాబు చేసిన పనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.