భరత్ అను నేను సీక్వెల్ కు సర్వం సిద్దం….కథ మాములుగా లేదుగా..

490

మహేష్ బాబు ఈ మధ్యే భరత్ అను నేను సినిమా చేశాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత మళ్ళి కొరటాల శివతో సినిమా చేస్తాడు అని వార్తలు వస్తున్నాయి.అయితే ఆ సినిమా కొత్త కథతో కాకుండా ఇటీవలే విడుదల అయ్యి వంద కోట్లకు పైగా సాదించిన సినిమాకు సీక్వెల్ అంటా.ఆ సినిమా మరేదో కాదు భరత్ అను నేను సినిమానే.

కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ గా నిలిచిన ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వరకూ హీరోలు ముఖ్యమంత్రి పాత్రల్లో నటించిన సినిమాలతో ‘భరత్ అనే నేను’కు కొంత పోలిక వచ్చినా, ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

‘భరత్ అనే నేను’ సినిమా మహేశ్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి, దుష్టుల భరతం పట్టడంతో ముగుస్తుంది. పాలనాపరంగా కొన్ని మార్పులు కూడా చేస్తాడంటా. ఇప్పుడు సీక్వెల్ గనుక తీస్తే మహేశ్ ముఖ్యమంత్రిగా చేసే మార్పులను, ఎదుర్కొనే సవాళ్లను సినిమాగా చూపవచ్చు. ఈ మేరకు కథా,కథనాలు సిద్ధం అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా విషయం మీద కొరటాల టీం స్పందించలేదు.భరత్ కు సీక్వెల్ అంటే మాత్రం మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం వస్తోంది.