హ‌రికృష్ణ‌ని చూడ‌టానికి రాని మ‌హేష్ బాబు జ‌య‌ను చూశారు కార‌ణం వింటే షాక‌వుతారు

466

తెలుగు ఇండ‌స్ట్రీలో హ‌రికృష్ణ మ‌ర‌ణం మ‌ర్చిపోక ముందే, తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో షాకింగ్ లాంటి వార్త త‌గిలింది… దర్శకురాలు బి జయ కన్నుమూశారు… రాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డైరెక్టర్ జయ, హైద‌రాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు… ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

Image result for harikrishna

ఇండస్ట్రీలో విజయవంతమైన అతికొద్ది మంది మహిళా దర్శకుల్లో జయ ఒకరు. 2003లో చంటిగాడు చిత్రంతో ఆమె దర్శకురాలిగా పరిచయమయ్యారు. బాలాదిత్య, సుహాసిని ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. గుండ‌మ్మగారి మ‌న‌వ‌డు, ప్రేమికులు, ప్రేమ కావాలి, ల‌వ్లీ, సవాల్ లాంటి సినిమాల‌కు ఆమె దర్శకత్వం వహించారు. ఆమె చివరిసారిగా దర్శకత్వం వహించిన ‘వైశాఖం’ 2017లో విడుదలైంది. ఇక ఆమె పార్ధివ దేవాన్ని సూప‌ర్ స్టార్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త చూసి నివాళులు అర్పించారు.. అలాగే ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి కూడా ఆమెకు పూల‌మాల వేసి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

Image result for mahesh babu

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్, 1000 చిత్రాలకు పీఆర్‌వోగా పనిచేసిన బీఏ రాజు జ‌య‌ భ‌ర్త‌… ఆయ‌న వైశాఖం సినిమాతో తొలిసారి నిర్మాతగా మారారు.. దీంతో ఆయ‌న‌కు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రితో అనుబంధం ఉంది… జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె కుంటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మ‌హేష్ బాబు న‌మ్ర‌త రావ‌డానికి కార‌ణం జ‌య కుటుంబంతో ప్రిన్స్ కుటుంబానికి ఎంతో మంచి రిలేష‌న్ ఉంది… జ‌య భ‌ర్తకు ఎంతో అనుబంధం ఉండ‌టంతో ఇక్క‌డ‌కు వ‌చ్చారు…ప్ర‌ముఖ సినిమాల‌కు ఆయ‌న పీ.ఆర్వోగా చేయ‌డంతో అంద‌రితో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హ‌రికృష్ణ మ‌ర‌ణ‌వార్త విన్నవెంట‌నే విదేశాల్లో షూటింగ్ లో ఉన్న మ‌హేష్ , డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి ఇక్క‌డ‌కు వ‌చ్చారు.. కాని అప్ప‌టికే ఆయ‌న అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యాయి… ఈలోపు కొన్నిగంట‌ల్లోనే జ‌య మృతి చెంద‌డంతో వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చారు. ఇక నంద‌మూరి కుటుంబాన్ని కొద్ది రోజుల్లో మ‌హేష్ ఫ్యామిలీ వెళ్లి ప‌ల‌క‌రిస్తారు అని తెలుస్తోంది. మొత్తానికి ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంపై అంద‌రూ షాక్ అవుతున్నారు.. మ‌రి ఆమె అకాల మ‌ర‌ణంపై మీ కామెంట్ల ద్వారా నివాళి అర్పించండి.