అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు

174

అనిల్ రావిపూడి సైలెంట్ గా హిట్స్ మీద హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నారు. పటాస్, సుప్రీమ్ , రాజా ది గ్రేట్ ,ఎఫ్2 … ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలలో ఎఫ్2 చిత్రం బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కూడా చెప్పాడు. అయితే అందరు నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ నే పట్టాల మీదకు తీసుకెళ్తాడేమో అనుకున్నాడు.

Image result for anil ravipudi

కానీ ఆ సినిమాను వదిలేసి మరొక కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. తాజాగా అనిల్ రావిపూడి కూడా మహేష్‌కు స్టోరీ లైన్ వినిపించారట.. అది విన్న మహేష్ ఖుషీ అయిపోయి పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని అనిల్‌కు సూచించారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో కూడా సినిమా రావటం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

Image result for anil ravipudi mahesh babu

మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా ఉండొచ్చు.