తన దర్శకుడికి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన మహేశ్ బాబు..

472

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యే భరత్ అను నేను సినిమా చేశాడు.ఈ సినిమా ప్రభంజనం స్ప్రుష్టించింది.మహేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ స్ప్రుష్టించిన సినిమాగా రికార్డ్ స్ప్రుష్టించింది.ఇక ఆ సినిమా తర్వాత ఏం సినిమా చేస్తాడా అని అభిమానులు ఎదురుచూశారు.

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని మన అందరికి తెలిసినదే.ఇది మహేష్ బాబు 25 వ సినిమా కావడం విశేషం.అయితే ఈరోజు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు అతడికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు.

వంశీ నేటితో 40 వ పడిలోకి అడుగు పెట్టాడు. 40 ఏళ్ళ నా యువ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ కు వంశీ థాంక్స్ మై హీరో అని రిప్లై ఇచ్చాడు.ఈ ట్వీట్ చాలా ఎక్కువ లైక్స్ రావడం విశేషం.