గోవాలో మహేష్ గ్రాండ్ బర్త్ డే పార్టీ!అతిధులు వీళ్ళే..

385

ఈరోజు మహేష్ బాబు బర్త్ డే.ఈరోజు అటు ఫాన్స్ కు ఇటు ఫ్యామిలీ సభ్యులకు సర్పైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు.మహర్షి ఫస్ట్ ఫస్ట్ లుక్, టీజర్‌తో ఫ్యాన్‌ను ఖుషీ చేసిన ప్రిన్స్ ఈ పార్టీల ద్వారా తన సన్నిహితులు, చిత్ర యూనిట్‌ను కూడా ఫిదా చేస్తున్నాడట.

 

రిషిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టిన ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గోవాలో గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడట. సన్నిహితులకు బుధవారం రాత్రే తన ఇంట్లో అత్యంత సన్నిహితులకు పార్టీ ఇచ్చిన మహేష్ చిత్ర యూనిట్‌కు గురువారం రాత్రి గోవాలో పార్టీ ఇస్తున్నాడని సమాచారం. ఇందుకోసం ఆయన ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి గోవా బయల్దేరి వెళ్లాడట.ఈ పార్టీ కోసం మహర్షి చిత్ర యూనిట్ గోవా బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది.

పార్టీ కోసం గోవాకు వెళ్తున్నారా.. అనుకోవద్దు. ఎందుకంటే మహేష్ 25వ సినిమా తదుపరి షెడ్యూల్‌ను గోవాలోనే చిత్రీకరించనున్నారట. రేపటి నుంచి ఐదు రోజులపాటు షూటింగ్ నిర్వహించి తిరిగొస్తారట.పనిలో పనిగా పార్టీ కూడా ఇచ్చినట్టు ఉంటుందని ముందుగానే వెళ్ళాడంటా.