మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్స్ సీజ్

430

మహేష్ బాబు టాలీవుడ్ లో క్రేజీ హీరో. మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ క్రేజ్ తో కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ఎండార్స్ మెంట్ కోసం మహేష్ వద్దకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ బాబు ఆదాయం ఏడాదికి కొన్ని కోట్లలో ఉంది. అయితే ఇన్ని కోట్లు సంపాదిస్తున్న మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్స్ ను ఇప్పుడు సీజ్ చేశారు. మరి ఎందుకు సీజ్ చేశారు అసలేమైంది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్స్ ని జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేసిన వార్త సంచలనంగా మారింది. 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లిపు విషయంలో మహేష్ బాబుకు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ మేరకు మహేష్ భారీ మొత్తంలో బాకీ పడ్డట్లు తెలుస్తోంది. పలుమార్లు జీఎస్టీ కమిషనర్ మహేష్ కు నోటీసులు పంపినా స్పందించక పోవడంతో తాజాగా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కార్పొరేట్ ఉత్పత్తుల ఎండార్స్మెంట్ విషయంలో కూడా మహేష్ బాబుకు మంచి డిమాండ్ ఉంది. 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను మహేష్ ఎండార్మెంట్ ద్వారా పొందిన మొత్తానికి సర్వీస్ టాక్స్ చెల్లించని కారణంగా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మహేష్ 18.05 లక్షల సర్వీస్ టాక్స్ చెల్లించలేదని జీఎస్టీ కమిషనరేట్ ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలో 2018 వరకు పెనాల్టీ, వడ్డీ కలుపుకుంటే మహేష్ చెల్లించాల్సిన మొత్తం 73 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జీఎస్టీ కమిషనర్ కార్యాలయం నుంచి మహేష్ కు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో అధికారులు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్స్ నుంచి సీజ్ చేసిన అధిక,అధికారులు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచి 43 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కళాకారులకు టాక్స్ చెల్లింపులో ఎలాంటి మార్పు రాలేదు. జీఎస్టీ వచ్చాక పలు టాక్స్ రేట్లు మారాయి. కానీ కళాకారులకు మాత్రం పాత టాక్సులనే జిఎస్టిలో కొనసాగించింది. దీని ప్రకారం 1,50,000లోపు ఆదాయం ఉన్నవారికి జీఎస్టీ లో మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుపై జీఎస్టీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. మహేష్ బాబు అకౌంట్స్ ను సీజ్ చెయ్యడం గురించి అలాగే దానికి గల కారణం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.