మహేష్ మల్టీప్లెక్స్‌ ఓపెనింగ్ మళ్ళి వాయిదా..ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో చూడండి

327

సూపర్ స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట మహేష్ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు.హైదరాబాద్‌లో నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌లో ఏడు స్క్రీన్లు ఉంటాయి. ఒకేసారి 1638 మంది కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలనే కుతుహలం ప్రేక్షకుల్లో పెరిగింది. గ్రాండ్ ఆడిటోరియంలో ఏడు స్క్రీన్లను అత్యున్నత సాంకేతికతతో రూపొందించారు.

Image result for mahesh multiplex

3డీ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందించే విధంగా నిర్మించారు. ఏఎంబీ సినిమాస్‌లో చూసే ప్రతీ ప్రేక్షకుడికి అన్ని విధాలా చక్కటి అనుభూతిని కలుగజేయడం ఖాయం.అయితే ఈ థియేటర్ ను థగ్స్ అఫ్ హిందూస్తాన్ అనే సినిమా ద్వారా ఓపెన్ చేయాలనుకున్నారు.అది వీలు కాలేదు. ఆ తర్వాత రజని 2.ఓ సినిమా ద్వారా ఓపెన్ చేయాలనుకున్నారు.కానీ ఇప్పుడు అది కూడా వీలు కాలేదు.

Image result for mahesh multiplex

ఇప్పటికీ లేజర్‌ స్క్రీనింగ్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభోత్సవం మరింత ఆలస్యం కానుందట. అధునాలతన సౌకర్యాలతో రూపొందించిన ఈ థియేటర్స్‌ను డిసెంబర్‌ 2న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నిర్వహకులు మాత్రం ఇంత వరకు ఓపెనింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించలేదు.