గ్రీన్ ఛాలెంజ్‌ లో బాగంగా సితారతో కలిసి మొక్కలు నాటిన మహేశ్ బాబు

372

తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన ‘గ్రీన్‌ ఛాలెంజ్’కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది.సోషల్ మీడియాలో కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు సెలెబ్రిటిలు మొక్కలు నాటుతున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల మొక్కలు నాటిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భార‌త మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ ఛాలెంజ్‌ చేశారు.కేటిఆర్ విసిరిన ఛాలెంజ్‌కు సచిన్, లక్ష్మణ్ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే.ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించారు.

తన ముద్దుల కూతురు సితారతో కలిసి మొక్కలు నాటారు. ఈ ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.తనను ఇలాంటి ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు మ‌హేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. అనంత‌రం త‌న ముద్దుల త‌న‌య సితార‌, త‌న‌యుడు గౌతంతో పాటు ద‌ర్శకుడు వంశీ పైడిపల్లికి ఆయ‌న గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.