Breaking News:సినీ ఇండస్ట్రీ లో ఘోరం ప్రముఖ నటుడు మృతి కుళ్లిపోయిన స్థితిలో చూసి …కుప్పకూలిన స్టార్ హీరోస్

749

బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో తన మార్కు విలనిజంతో ఆకట్టుకొన్న నటుడు మహేష్ ఆనంద్ దారుణమైన స్థితిలో మృతిచెందడం సినీ వర్గాలను కలిచివేసింది. ముంబైలోని అంధేరిలో యారీ రోడ్‌ ప్రాంతంలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించడం చర్చనీయాంశమైంది. ఆత్మహత్య చేసుకొన్నాడా? లేదా అనారోగ్య పరిస్థితుల్లో మరణించాడా? అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఆనంద్ మరణం నేపథ్యంలో చాలా విషాదకరమైన, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే.. వెండితెర మీద ప్రభావవంతమైన విలనిజాన్ని పండించిన మహేష్ ఆనంద్ గత 18 ఏళ్లుగా మేకప్ వేసుకోకుండా ఉన్నారు. దాంతో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు. కష్టాల ఓ వైపు వెంటాడుతుంటే మరోవైపు మద్యానికి బానిసయ్యాడు అని సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి నంబర్‌వన్‌ చిత్రంలో

ఇలాంటి పరిస్థితుల్లో గోవిందా నటించిన రంగీలా రాజా చిత్రంలో చిన్న అవకాశం వచ్చింది. రంగీలా రాజా చిత్రంలో అవకాశం రావడంపై మహేష్ ఆనంద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు సినిమా పరిశ్రమలో అవకాశం దక్కడంపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కేవలం 6 నిమిషాల వ్యవధి ఉన్న పాత్ర దొరకడంపై సానుకూలంగా స్పందించారు. ఇక నా సినీ కెరీర్ మళ్లీ గాడిన పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రంగీలా రాజా చిత్రం ఆఫర్ తర్వాత బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా ఎవరూ నాకు అవకాశం ఇవ్వలేదు. మనిషి రూపంలో దేవుడు వచ్చి నాకు చిన్న రోల్‌ను ఇచ్చారు. మళ్లీ ఇండస్ట్రీలోకి రావడానికి ఇది ఓ అడుగుగా భావిస్తున్నాను. 18 ఏళ్లుగా ఎవరూ పలకరించలేదు. రంగీలా రాజా చిత్రంలో ఆఫర్ ఇవ్వానికి నిర్మాత పహ్లాజ్ నిహలానీ తన ఆఫీస్‌కు పిలచారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆఫీస్‌కు వెళ్లడానికి కూడా నా వద్ద డబ్బులు లేకుండాపోయాయి. ఆటోరిక్షాకు కూడా డబ్బులు చెల్లించలేకపోయాను. నా కెరీర్‌లో ఎంతో మంది పెద్ద హీరోలతో నటించాను. చివరకు నన్ను గుర్తుంచుకొనే వాళ్లు లేకపోయారు అని మహేష్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సన్నీడియోల్, సంజయ్ దత్, గోవిందా లాంటి అగ్రహీరోలతో నటించారు. తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సూపర్‌స్టార్ నటించిన నంబర్ వన్ చిత్రంలో నటించారు. అమితాబ్‌తో షహెన్‌షా, సంజయ్ దత్‌తో గుమ్రా, గోవిందాతో ఖుద్దార్, రంగీలా రాజా లాంటి చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉండగా, మహేష్ ఆనంద్ దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు చోటుచేసుకొన్నాయి. ఆనంద్‌ను వదిలేసి భార్య మాస్కోకు వెళ్లిపోయారు. మహేష్ ఆనంద్ మరణం తర్వాత మీడియా ఆమెను సంప్రదించగా.. మేము 2002 నుంచి ఒకరికొకరం కలుసుకోలేదు. అప్పటి నుంచి విడిగానే ఉంటున్నాం అని భార్య పేర్కొన్నారు.