మహర్షిలో ఐదు గెటప్పుల్లో మహేష్ విశ్వరూపం.

311

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.పూజాహెగ్డే హీరోయిన్. దిల్ రాజు ప్రసాద్ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ కోసం వంశీ తిరుగులేని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Image result for mahesh maharshi

మహర్షి చిత్రంలో మహేష్ పాత్ర గురించి వస్తున్న వార్తలు అంచనాలు భారీగా పెంచేలా ఉన్నాయి.ఈ చిత్రంలో మహేష్ బాబు ఐదు విభిన్న రూపాల్లో నట విశ్వరూపం ప్రదరించబోతున్నాడని సమాచారం. కాలేజీ రోజుల నుంచి మొదలు పెడితే కంపెనీ అధినేతగా ఎదిగేవరకు మహేష్ విభిన్నమైన లుక్స్ లో అమరిస్తాడట. దీనికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి.

Image result for mahesh maharshi

కథలో చోటు చేసుకునే పరిణామాల వలన మహేష్ లుక్ ప్రతి అరగంటకు మారిపోయే విధంగా ఉంటుందట.ఈ చిత్ర కథ గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అమెరికా నుంచి పల్లెటూరికి వచ్చి ఇక్కడి ప్రజలను మార్చే కుర్రాడి పాత్రలో మహేష్ కనిపిస్తాడంట.