‘మహానటి’ కి మరోక ప్రతిష్టాత్మక అవార్డు…

390

అలనాటి అందాల తార, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. నాగ అశ్విన్ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించగా దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో అలరించారు.

Image result for mahanati

ఈ ఇద్దరే కాకుండా మధురవాణిగా సమంతా అలాగే అక్కినేని నాగేశ్వర రావు గా అక్కినేని నాగ చైతన్య,విజయ్ దేవరకొండ,డైరెక్టర్ క్రిష్.ప్రకాష్ రాజు,మోహన్ బాబు లాంటి స్టార్స్ ఇందులో నటించారు.విడుదల అయినా ప్రతి సెంటర్ లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించేసింది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రెటీలు సైతం ఈ చిత్రానికి దాసోహమయ్యారు. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా సత్తా చాటింది.

Mahanati Wins The Indian Film Festival Of Melbourne Equality In Cinema Award

కాగా ఇప్పటికే ఈ చిత్రానికి భారీ స్థాయిలో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చయి.ఇప్పుడు మరొక అరుదైన గుర్తింపు లభించింది.ఆస్ట్రేలియాలో జరిగిన ‘ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌’లో ‘మహానటి’ చిత్రానికి ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు వచ్చింది.