బిగ్‌బాస్2 కౌశల్‌కు మాధవి లత సపోర్ట్..

456

ఇంటి సభ్యులంతా కౌశల్‌ను టార్గెట్ చేస్తూన్నారు. పలు విషయాల్లో కౌశల్ తీరును తప్పుబడుతూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాధవి లత రంగంలోకి దిగి కౌశల్‌కు మద్దతుగా పోస్టు చేసింది.ఒకటి చెప్పాలి అనిపించి కంట్రోల్ చేసుకున్నాను. కానీ నా ఫీలింగ్స్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? నేను బిగ్‌బాస్ షోలో కౌశల్‌కు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అతడు 100% శాతం గేమ్ ఆడుతున్నాడు.

బిగ్‌బాస్ అంటేనే గేమ్ షో. అక్కడ హౌస్ మేట్స్ తో బంధాలు పెంచుకోవడం కాన్సెప్టు కాదు. ప్రేక్షకుల మనసు గెలవాలి, గేమ్ ఆడాలి. అదే బిగ్‌బాస్ థీమ్. అతడు దాన్ని పర్ఫెక్టుగా ఫాలో అవుతున్నాడు.అతడు మాట్లాడకపోతే ఇంట్రోవర్ట్ అంటారు, మాట్లాడితే సెల్ఫిష్ అంటారు. గెలవాలంటే గేమ్ ఆడాలి కానీ అనుబంధాలు, మకరందాల సీరియల్ నడపకూడదు కదా. గేమ్ అన్నాక సెల్ఫిష్ నెస్ తప్పకుండా ఉండాలి. ఒక వేళ అదిలేక పోతే ఎవరూ గేమ్ ఆడలేరు.

ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారు సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నారు. మరి కేవలం కౌశల్ మాత్రమే ఎందుకు అపరాధి అయ్యాడు. ఎందుకంటే అతడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాను. నా ఉద్దేశ్యం ప్రకారం నేను సిన్సియార్టికే సపోర్టు చేస్తాను అని మాధవిలత కౌశల్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది.