మా`లో మరో వివాదం.. ఈ సారి నరేష్‌ vs జీవిత రాజశేఖర్‌

207

ఇటీవల కాలంలో మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి.ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో మా అసోషియేషన్‌లో మరో వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకే ప్యానల్‌ నుంచి పోటి చేసిన నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య ఇప్పుడు గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

Image result for jeevitha and naresh

అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే ఎక్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, సెక్రటరీ జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై మా అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో ఆయన తరుపు న్యాయవాది స్పదించారు. అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించారు.అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్‌ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య వివాదాలు జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నరేష్‌కు రాజశేఖర్‌ తన వర్గంతో కలిసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

గ‌తం నుంచి చూస్తే నరేష్ పనితీరుపై జీవిత రాజశేఖర్ మధ్య అసహనం వ్యక్తం చేయడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. నరేష్ పని తీరుపై చర్చించి, సమస్యలు పరిష్కరించుకుందామంటూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ మెంబర్లకు జీవితారాజశేఖర్ దంపతులు మెసేజ్ పెట్టారు. గతంలో ఉన్న రూ. 5.5 కోట్లనే నరేష్ ఖర్చు చేస్తున్నారని, మూలధనంలో రూపాయి కూడా జమ చేయలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు.మా’లో వివాదాలు రాజుకున్న నేపథ్యంలో ‘మా’ గౌరవ సలహాదారు యు.వి. కృష్ణం రాజు స్పందించారు. 25 ఏళ్లుగా అందరూ మెచ్చుకునేలా ‘మా’ ఉందని, ఇకపై కూడా అలాగే గౌరవంగా ఉండేలా అందరూ కలిసి చర్చించుకుని ఈ మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకోవాలని కృష్ణంరాజు హితబోద చేశారు. ఈ వివాదానికి నేటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన సూచించారు.

ఈ క్రింద వీడియో చూడండి