లవర్ బాయ్ “అబ్బాస్” ఇప్పుడు ఏ రంగంలో స్థిరపడ్డాడో తెలుసా.

860

యువతీ యువకులను ప్రేమలోకంలో విహరింపజేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ తో వచ్చిన మూవీ ప్రేమదేశం.ఈ మూవీ నేటికీ ఎవర్ గ్రీన్ మూవీగా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతోనే అబ్బాస్ సినీ రంగంలోకి వచ్చాడు.ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమాతో ఎక్కడ చూసినా కుర్రాళ్ళు అబ్బాస్ హెయిర్ స్టైల్ ఫాలో అయ్యారు. ఇక ఏ హీరోకైనా తొలిచిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ కి వెళ్తే, ఇక ఆ హీరో కెరీర్ చాలా ఎత్తుకు ఎదుగుతుంది. మరి ఎందుకనో అబ్బాస్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది.

తమిళ, తెలుగు భాషల్లో బోల్డన్నీ ఆఫర్స్ వచ్చిపడ్డాయి. దాంతో ఏది వదిలేయాలా, ఏది చేయాలో తెలియక ఎన్నో సినిమాలకు ఒకే చెప్పేసాడు.ఇక కొన్ని వదిలేసాడు.ఇక ఆ తర్వాత అతను నటించిన సినిమాలు దెబ్బతినడం వలన అడపాదడపా క్యారక్టర్ రోల్స్ కి పరిమితం అయ్యాడు.అయితే కెరీర్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడే 2001లో ఏరోమా అనే ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లిచేసుకున్న అబ్బాస్ కి అమరా , అయేమా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

చెన్నైలో సెటిల్ అయిన అబ్బాస్ భార్య తమిళంలో అనేక మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవరించింది. అలాగే ఇంకో నటుడు మాధవన్ వైఫ్ తో కలిసి ఏరోమా కొన్ని చిత్రాలకు స్టైలిష్ గా వర్క్ చేసింది. ఇక మలయాళ చిత్రంలో ఆఖరిగా నటించి ఛాన్సులు లేని,అబ్బాస్ భార్యతో కల్సి ఫ్యాషన్ డిజైన్ రంగంలో అడుగుపెట్టినట్లు చెబుతున్నారు.ఇప్పుడు ఈ రంగంలోనే ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు.మరి ఇందులోనైనా మంచిగా రాణించాలని కోరుకుందాం.