బిగ్ బాస్ హౌస్ లో ఒక రేంజ్ లో పిచ్చేక్కించిన దీప్తి సునైనా చూడకపోతే చాలా మిస్ అవుతారు

504

బిగ్‌బాస్‌లో ఐటెంగా అదరగొట్టిన పిట్ట.. బయటకు వచ్చాక దర్శకులు వెంట పడతారేమో!
బిగ్‌బాస్‌లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకట్టుకుంటున్న పార్టిసిపెంట్‌ దీప్తి సునయన. సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను దక్కించుకున్న దీప్తి సునయన బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా తనదైన శైలిలో క్యూట్‌ క్యూట్‌ మాటలతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటూ ఉంది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న దీప్తి సునయన గత కొన్ని రోజులుగా తనీష్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ గేమ్‌పై దృష్టి పెట్టలేక పోతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలోనే దీప్తి సునయన ఎక్కువగా తనీష్‌ వెనకాలే ఉండి పోతుంది అంటూ నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో దీప్తి సునయన ఎక్కువగా ఫోకస్‌ అయ్యేలా ప్రయత్నిస్తాను అంటూ తనీష్‌ చెప్పుకొచ్చాడు.

Image result for deepthi sunaina

ఇక బిగ్‌బాస్‌ ఈ వారం ఇచ్చిన లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ అయిన బిగ్‌బాస్‌ బ్లాక్‌ బస్టర్‌లో దీప్తికి మంచి ఛాన్స్‌ దక్కింది. తనకు ఎంతో తెలిసినా, నచ్చిన డాన్స్‌ను చేసే అవకాశం ఆమెకు బిగ్‌బాస్‌ ఇచ్చాడు. ఆర్య చిత్రంలో రింగ రింగ పాటకు సామ్రాట్‌తో కలిసి దీప్తి సునయన ఐటెం సాంగ్‌ చేసింది. ఈ ఐటెం సాంగ్‌ తాజా ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. తేజస్వి కంపోజింగ్‌లో దీప్తి సునయన చేసిన ఐటెం సాంగ్‌ నిజంగా సినిమాలో ఐటెం సాంగ్‌ మాదిరిగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీప్తి సునయన కాస్ట్యూమ్స్‌ కూడా నిజంగా ఐటెం గర్ల్‌ మాదిరిగా కనిపించేలా చేశాయి.

Image may contain: 1 person

తేజస్వి ఈ ఐటెం సాంగ్‌ కోసం చాలా కష్టపడి సునయనను రెడీ చేయడం దగ్గర నుండి డాన్స్‌ కంపోజింగ్‌, వారికి ఎంకరేజ్‌ మెంట్‌ ఇలా అన్ని విషయాలో తేజస్వి సత్తా చాటింది. ఇక దీప్తి సునయన మంచి ఎనర్జితో, చాలా తక్కువ సమయంలోనే డాన్స్‌ను ప్రాక్టీస్‌ చేసి, సునాయాసంగా డాన్స్‌ను చేసేసింది. సామ్రాట్‌తో మొదట ఐటెం సాంగ్‌ చేయదేమో అని అనుకున్నారు. కాని సామ్రాట్‌తో అయినా మరెవ్వరితో అయినా ఐటెం సాంగ్‌ చేసేందుకు తాను ఓకే అంటూ ముందుకు వచ్చింది. ఈ మొత్తం టాస్క్‌లో దీప్తి సునయన ఐటెం సాంగ్‌ హైలైట్‌ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

Image result for deepthi sunaina

తర్వాత ఎపిసోడ్‌లో స్వయంగా బిగ్‌బాస్‌ మరియు వారాంతంలో నాని కూడా ఇదే మాట అనడం ఖాయం. ఇక బిగ్‌బాస్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత పిట్టకు వరుసగా ఐటెం సాంగ్స్‌ చేసే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. దీప్తి సునయన రోజు రోజుకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది. భారీ ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న దీప్తి సునయన ఈ ఫర్‌ఫార్మెన్స్‌తో మరో స్టెప్‌ పైకి ఎక్కేసింది.

బిగ్ బాస్ హౌస్ లో ఒక రేంజ్ లో పిచ్చేక్కించిన దీప్తి సునైనా చూడకపోతే చాలా మిస్ అవుతారు
ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీప్తి సునయన ముందు ముందు ఎలిమినేషన్స్‌లో ఉన్నా కూడా ఈ క్రేజ్‌తో నెగ్గుకు రావడం ఈజీ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిట్ట కొంచెం కూత గణం అన్నట్లుగా దీప్తి బిగ్‌బాస్‌ ఇంట్లో దుమ్ము లేపేస్తోంది అనేందుకు ఇదే ఉదాహరణ.

ఈ క్రింద వీడియో మీరు చూడండి