అంజలి ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్

612

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టి అంజ‌లి ఎవరికైనా తెలుసు, న‌వ్వుతూ చిలిపిగా ఉండే ఆమె ఫేస్ తెర‌పై క‌నిపిస్తే అంద‌రూ స్మైల్ ఫేస్ పెడ‌తారు.. ముఖ్యంగా త‌న న‌ట‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంది ఈ భామ‌…అంజలిది తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు, ఇక్క‌డ సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి. అలా ముందు జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన ‘డేర్స‌. ఈ చిత్రంతో అంజ‌లికి కాస్త గుర్తింపు వ‌చ్చింది..తర్వాత 2006లో ‘ఫొటో’ సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో ‘ప్రేమలేఖ రాశా’.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన ‘షాపింగ్‌మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ ‘జర్నీ’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అంజ‌లి సినిమా లైఫ్ ని ట‌ర్న్ చేసింది అని చెప్పాలి.2011లో విడుదలైన ‘జర్నీ’ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది.ఇక 2013లో మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.

Image result for actress anjali

తర్వాత ‘బలుపు’ సినిమాలో శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని, రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది. తమిళచిత్రం ‘ఎంగేయం ఎప్పోదం’ (తెలుగులో జర్నీ)లో తన అద్భుతమైన నటనకు గాను ‘సౌత్ ఫిల్మ్‌ఫేర్-2012’, ‘విజయ్’ అవార్డులు సొంతం చేసుకుంది. ఇక ఫిలిమ్ ఫేర్ అవార్డులు కూడా అందుకుంది ఇక ఇటీవ‌ల ఆమె కాస్త బొద్దిగా ఉంది అని కొన్ని సినిమా అవ‌కాశాలుకూడా దూరం అయ్యాయి అని వార్త‌లు వినిపించాయి. ఇక ఈ విష‌యం సీరియ‌స్ గా తీసుకున్నఆమె తన బ‌రువు త‌గ్గ‌డంలో కాస్త శ్ర‌ద్ద పెట్టింది అని చెప్పాలి ఇప్పుడు అంజ‌లిని చూస్తే స‌న్న‌గా క‌రెంట్ తీగ‌గా మారిపోయింది. ఇక సినిమాల్లో మ‌ళ్లీ త‌న పాత స్పీడుని చూపిస్తుంది అంటున్నారు ఆమె అభిమానులు. మ‌రి ఆమె లుక్ చూసి మీ అభిప్రాయం కూడా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.