ఒకప్పటి హీరోయిన్ ‘సాక్షి శివానంద’ గుర్తుందా ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు

1859

సినీ రంగంలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. రంగుల మాయా ప్రపంచంలో ఉన్నత స్థితిలో రాణించేది కొందరైతే, అధః పాతాళానికి చేరేది కొందరు అని చెప్పాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్నవాళ్లు రేపు ఉండరు. ప్రతిరోజు ఒక కొత్త ముఖం కావలి. కొత్త అందాలు వచ్చేకొద్దీ పాత అందాలు దూరమవ్వాల్సిందే. అయితే వారు తెరకు దూరమయిన వారు పోషించిన పాత్రలు మాత్రం మనకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. అలా ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో సాక్షి శివానంద్ ఒకరు.

Image result for సాక్షి శివానంద

సాక్షి శివానంద్ తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. 1977 ఏప్రిల్ 15 న ముంబైలో జన్మించింది. సినిమాల మీద ఉన్న ఫాషన్ తో సినీ రంగంలో అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది. 1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది. తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో ఇక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు,చిరంజీవితో ఇద్దరు మిత్రులు సినిమాలలో కథానాయికగా నటించింది.మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న టైం లో సడన్ గా ఈ అమ్మడు సినిమాలనుండి మాయం అయ్యింది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘హోమం’ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైంది. ‘రంగ ది దొంగ’ సినిమాలో ‘మిల మిల మిల మీనాక్షి..’ అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. గత యేడాది ఆమె ఒక హిందీ సినిమాలో నటించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని పాత్ర బాగుంటే సినిమా చేస్తానని చెబుతోంది సాక్షి. సాక్షి శివానంద్ పెళ్ళి చేసుకున్న విషయం కూడా చాలా మందికి తెలీదు. అప్పట్లో నేను పెళ్లి చేసుకోలేదు. బాయ్ ఫ్రెండ్ తోనే కాలం గడుపుతున్నా అని మీడియాకు బహిరంగంగా చెప్పింది. తన తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న అని ఆమె మీడియాకు చెప్పింది .అయితే ఎన్నో రోజులు అలా ఉంటుంది చెప్పండి అందుకే ఆమె సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్ళి ఫోటోలు ఒకటి కూడా బయటకు రాలేదు. సాగర్ ఒక బిజినెస్ మెన్. ఇతనినే పెళ్లి చేసుకుంది సాక్షి. ప్రస్తుతం సాక్షి తన భర్త కు ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.ఆమెకు మంచి అవకాశాలు వచ్చి మనల్ని అలరించాలని కోరుకుందాం. మరి సాక్షి శివానంద్ గురించి ఆమె ప్రస్తుత జీవన శైలి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.