నన్ను వదిలెయ్యండి అంటూ అజిత్ కన్నీటి లేఖ

386

హీరో అజిత్ కి తమిళనాట గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విశ్వాసం’ రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం మొదలైంది. దాంతో కొన్ని ప్రాంతాల్లో అభిమానులు సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టారు.తమిళ హీరో అజిత్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారని, ఆయన బీజేపీతో చేరుతారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం కూడా సాగిపోయింది.. అజిత్‌ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కమలనాథులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆయన కమలదళంలో చేరుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Image result for అజిత్

అజిత్ అభిమానుల సంఘాలకు చెందిన కొందరు బీజేపీ తమిళనాడు రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై సౌందరరాజన్…అజిత్ చాలా నిజాయితీ కలిగిన నటుడంటూ ప్రశంసల జల్లుకురిపించారు. ప్రజలకు అజిత్ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. అజిత్, ఆయన అభిమానులు ప్రధాని మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె వ్యాఖ్యలతో అజిత్ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం మరింత జోరందుకుంది.ఇక ఇలాంటి వార్త‌లు రోజు రావ‌డంతో అజిత్ దీనిపై క్లారిటీ ఇవ్వాలి అని స్పంందించారు.. రాజ‌కీయ ఎంట్రీ పై స్పందించిన అజిత్…తాను బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. నటించడమే తన ఏకైక వృత్తిగా అజిత్ పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

తనకు, తన అభిమానులకు రాజకీయ రంగు పులమకూడదన్న ఉద్దేశంతోనే కొన్నేళ్ల క్రితం తన అభిమానుల సంఘాలన్నిటినీ రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో అజిత్ గుర్తుచేశారు. ఎన్నికలకు ముందుగా ఇలాంటి అవాస్తవ కథనాలను ప్రచురించడం మీడియాకు తగదన్నారు. దీని ద్వారా తప్పుడు సంకేతాలు వళ్లే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తన‌కు లేదని స్పష్టంచేశారు. తనకు రాజకీయాలతో సంబంధమున్న ఏకైక అంశం…క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకోవడం మాత్రమేనన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీ పట్లా ప్రత్యేక అభిమానం లేదని అజిత్ ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అజిత్ స్పష్టంచేశారు. కొంతమంది పనిలేని వాళ్లు .. పనిగట్టుకుని చేస్తోన్న ప్రచారం ఇది. ఈ ప్రచారాన్ని అభిమానులు పట్టించుకోవద్దు. ఎవరికి వారు తమ కుటుంబం బాగోగులపై దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలను గురించి పట్టించుకుంటూ సమయాన్ని వృథా చేసుకోవద్దు\” అని చెప్పారు. మొత్తానికి అజిత్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు నిరాస‌లో ఉన్నారు. మ‌రి అజిత్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.