మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే నేను సహించను….లావణ్య త్రిపాఠి

379

అందాల రాక్షసి సినిమా ద్వారా వెండితెర మీద దర్శనం ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ.ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నెటిజన్స్ మీద గుస్సుమంటుంది.ఎందుకో తెలుసా..ఈ మద్య సోషల్ మీడియాలో లావణ్య గురించి కొన్ని గాసిఫ్స్ వినిపిస్తున్నాయి.

Image result for lavanya tripathi

ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠి వదిలేసిన రెండు సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యాయంటూ ట్వీట్ చేసింది. ‘తొలిప్రేమ’, ‘గీత గోవిందం’ సినిమాలను లావణ్య వదులుకున్నారు, కానీ అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటూ చేసిన ట్వీట్‌పై లావణ్య స్పందించింది.తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం గాసిప్స్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.నేను ఏ సినిమా వదులుకోలేదని స్పష్టం చేసింది.

Image result for lavanya tripathi

తన గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని అందాల రాక్షసి హెచ్చరించింది. ‘నా గురించి వస్తున్న గాసిప్స్ పై మౌనంగా ఉంటున్నానంటే దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న న్యూస్ పూర్తిగా ఫేక్ న్యూస్ అని, అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని ఫైర్ అయింది. ఈ విషయాన్ని లావణ్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.