breakingnews : అమితాబ్ ఆరోగ్య పరిస్థితి విషమం..

1159

బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఈ మధ్యనే సైరా నరసింహ రెడ్డిలో గోసాయి వెంకన్న పాత్రలో నటించి మనల్ని అలరించాడు. ఓ పక్క సినిమాలు మరోపక్క ప్రకటనల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ముఖ్యంగా అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం. వారంలో ఒకరోజు ఖచ్చితంగా అభిమానులను కలుసుకుంటుంటాడు అమితాబ్. ప్రతి ఆదివారం అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా సందడిగా ఉంటుంది. ముంబై జుహు ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి పలువురు ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి దర్శనం కోసం వస్తుంటారు. బిగ్ బి సైతం వారిని ఉత్సాహ పరుస్తూ బయటకు వచ్చి అందరి కలుస్తారు. గత 36ఏళ్లుగా జల్సా వద్ద అభిమానుల జాతర కొనసాగుతోంది.

Image result for అమితాబ్ ఆరోగ్య పరిస్థితి విషమం

అయితే గడిచిన ఆదివారం జల్సా వద్దకు వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. అమితాబ్ కనిపించక పోవడంతో అందరూ నిరాశగా వెనుదిరిగారు. బయటకు వచ్చి అభిమానులను పలకరించలేని స్థితిలో అమితాబ్ ఉండటమే ఇందుకు కారణం. అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో అమితాబ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారని సమాచారం అందుతోంది. ముంబై నగరంలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ కు చికిత్స జరుగుతోందని మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో అమితాబ్ బచ్చన్ ను ఆస్పత్రిలో చేర్చారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టారు. అమితాబ్ బచ్చన్ స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ తనకు క్షయ వ్యాధి సోకిన సంగతి వ్యాధి సోకిన 8 సంవత్సరాల వరకు తెలియదని, ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవటంతో వైద్య పరీక్షల్లో క్షయ వ్యాధి ఉందని తెలిసిందని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి

రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవటం వలన క్షయ సోకిందనే విషయం ఆలస్యంగా తెలిసిందని అన్నారు. ఇప్పటికే 75 శాతం లివర్ పూర్తిగా చెడిపోయిందని కేవలం 25 శాతం లివర్ తోనే సర్వైవ్ అవుతున్నానని అమితాబ్ బచ్చన్ గతంలో చెప్పారు. అలాగే కూలీ సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి విజయం సాధించారు. అయితే అప్పటి ఎఫెక్ట్ ఆయన్ను తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ క్రమంలో 2005, 2012లో కడుపులో సర్జరీలు జరిగాయి. గతేడాది కూడా ఆయన ఆసుపత్రిలో గడిపారు. అమితాబ్ బచ్చన్ వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు. తరచూ అనారోగ్యం వేధిస్తున్నా, వయసు సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నటుడిగా ఆయన అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘బద్లా’ చిత్రం విజయం అందుకుంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. ఆయన ఆరోగ్యం కుదుటపడి ఇంకా మంచి మంచి చిత్రాలలో నటించి మన అందరిని అలరించాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి