భానుప్రియ మీద కేసు నమోదు..

178

నటి భానుప్రియను పోలీసు కేసు వెంటాడుతోంది. గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో భానుప్రియపై బాలకార్మికుల నేరం నమోదైంది. అయితే ఈకేసుకు సంబంధించి మొదటి ఫిర్యాదు చెన్నైలో నమోదవడంతో కేసును చెన్నైకు బదిలీ చేశారు పోలీసులు. పోస్టల్‌లో వచ్చిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఆధారంగా భానుప్రియపై 323, 506,341 సెక్షన్లతో పాటు 75, 79 జువైనల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు పాండిబజార్‌ పోలీసులు. చెన్నైలో ఉంటున్న భానుప్రియ మెడకు పోలీసు కేసు చుట్టుకుంటోంది. గత జనవరి 19న తన ఇంట్లో పని చేసే అమ్మాయి దొంగతనం చేసిందంటూ సోదరుడు గోపికృష్ణతో కలిసి పాండిబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈకేసులో చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పనిపిల్ల తల్లి ప్రభావతి గతంలోనే సామర్లకోట పోలీసులకు భానుప్రియపై ఫిర్యాదు చేసింది.

Image result for భానుప్రియ

త‌న కూతురు సంధ్య‌ను భానుప్రియ వాళ్ల ఇంట్లో ప‌నికి తీసుకెళ్లింది. ప‌దివేల రూపాయ‌ల జీతం ఇస్తాన‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు రూపాయి జీతం కూడా ఇవ్వ‌లేదు. గత కొన్నాళ్లుగా తన కూతుర్ని ఇంటికి పంపించడంలేదని.. ఫోన్‌లో కూడా మాట్లాడకుండా తన కుమార్తెను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని తెలిపింది. భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై గత కొన్నాళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని గట్టిగా అడిగితే తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ, తన కూతుర్ని రక్షించమని ఆ మహిళ పిర్యాదు చేసింది. ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదుతో నటి భానుప్రియపై బాల కార్మికుల నేరం నమోదు చేశారు సామర్లకోట పోలీసులు. ఈ కేసులో భాగంగానే సామర్లకోట పోలీసులు చెన్నైకి వెళ్లి నటి భానుప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్‌ చేసి విచారించారు.

ఈ క్రింద వీడియో చూడండి

భానుప్రియ ఈ కేసు గురించి మాట్లాడుతూ… బాలిక తల్లి ప్రభావతి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో దొంగిలించిన వస్తువుల గురించి నిలదీయడంతో తిరిగి తమపైనే తప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు. సదరు బాలిక ఏడాది నుంచి తమ వద్దే పనిచేస్తోందని, ఇంట్లో ఉన్న డబ్బు, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో బాలికను నిలదీశాం. దీంతో ఆ బాలిక అసలు విషయం చెప్పింది. ఇంట్లో దొంగిలించిన నగదు, వస్తువులను బాలిక తన తల్లికి ఇచ్చేది. పోలీసులకు చెబుతామని హెచ్చరించే సరికి ఆమె తన తప్పును అంగీకరించింది అని భానుప్రియ తెలిపారు. బీరువా తాళాలు ఎక్కడ పెడతామో గమనించి వేకువజామునే దొంగతనానికి పాల్పడేదని వివరించారు. రూ.1.50 లక్షల నగదు, నగలు దొంగతనం చేసిందని చెప్పారు. దొంగతనం విషయమై బాలిక తల్లిని ప్రశ్నించడంతో ఆమె వెంటనే చెన్నై వచ్చిందని ఐప్యాడ్‌, వాచ్‌, కెమెరా ఇచ్చి మిగిలిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లి తమపై తప్పుడు ఫిర్యాదు చేసిందని అప్పట్లో భానుప్రియ వెల్లడించారు. అయితే ఈ కేసును సామర్లకోట పోలీసులు తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఏ క్షణంలోనైనా భానుప్రియను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.