బిగ్ బాస్ హౌస్ నుంచి నూత‌న నాయుడు అవుట్ క‌న్నీరు పెట్టుకున్న కౌశ‌ల్

475

బిగ్‌బాస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. ఇంట్లో తనదైన శైలిలో రాణిస్తున్న సభ్యుడు నూతన్ నాయుడు అనూహ్యంగా, అర్ధాంతరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా గాయపడిన నూతన్‌ను మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.

Image result for bigg boss telugu

బిగ్‌బాస్ ఇంట్లో 68 రోజును ఇంటి సభ్యులు హుషారుగాటాస్క్ ప్రారంభించారు. నూతన్ నాయుడు కూడా ఉత్తేజంగా కనిపించాడు. ఉదయం వచ్చే పాటకు చక్కగా డ్యాన్స్ చేశాడు. గీత వేసిన సైటైర్‌కు తనదైన శైలిలో స్పందించారు…ఇంట్లో మధ్యాహ్నం కెప్టెన్ టాస్క్ మొదలైంది. కెప్టెన్ షిప్ కోసం కౌశల్‌, రోల్ రైడా పోటీ పడ్డారు. కొన్ని బ్లాక్స్‌ను ఇచ్చి పిరమిడ్ నిర్మించాలని టాస్క్‌గా నిర్దేశించారు. పడగొట్టు.. నిలబెట్టు అని పేరు పెట్టారు. రోల్ రైడాకు ఎర్రటి బ్లాకులు, కౌశల్‌కు గ్రీన్ బ్లాకులు ఇచ్చారు. వాటిని ఇంటి సభ్యులు బంతిని విసిరి పడగొట్టేందుకు ప్రయత్నిస్తే వాటిని పోటీదారులు కాపాడుకోవాల్సి ఉంటుంది.

Image result for bigg boss telugu nutan naiduపడగొట్టు.. నిలబెట్టు టాస్క్ కొన్ని గంటలపాటు జరిగింది. ఈ టాస్క్‌కు పూజా రామచంద్రన్ సంచాలకులుగా వ్యవహరించారు. కౌశల్‌కు మద్దతుగా నూతన్ నాయుడు నిలిచారు. రోల్ రైడా నిర్మించిన పిరమిడ్‌ను కొటేందుకు ప్రయత్నించగా భుజంలోని ఎముకు డిస్ లొకేట్ (స్థాన భ్రంశం) జరిగింది. దాంతో ఆయనను కన్ఫెషన్ రూమ్‌లోకి పంపిచారు…నూతన్‌ గాయం తీవ్రం కావడంతో ప్రాథమిక చికిత్సను అందించారు. నూతన్ పరిస్థితి క్రిటికల్ కావడంతో వైద్యులు హాస్పిటల్‌కు తరలించాలని సూచించారు. కన్ఫెషన్ రూంలో ప్రాథమిక చికిత్స పొందుతున్న నూతన్ నాయుడితో బిగ్‌బాస్ మాట్లాడాడు. నీకు క్రిటికల్ షోల్డర్ డిస్ లొకేషన్ జరిగింది. కావున మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. దాంతో నూతన్ నాయుడికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కౌశల్‌ను కన్ఫెషన్ రూమ్‌కు బిగ్‌బాస్ పిలిపించారు. తన భుజానికి తీవ్ర గాయమైంది. తనను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారని నూతన్ తెలిపాడు. దాంతో కౌశల్ ఒక్కసారిగా షాక్ గురి అయ్యాడు. నూతన్ నాయుడిని ఇంటి నుంచి పంపిస్తున్నారని చెప్పగానే కౌశల్ కుప్పకూలిపోయాడు…. కన్ఫెషన్ రూమ్‌లో నుంచి హాలులోకి రాగానే ఇంటి సభ్యులు చుట్టుముట్టారు. నూతన్ నాయుడు ఇంటి నిష్క్రమిస్తున్నాడు అని చెప్పగానే ఇంటి సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు.కెప్టెన్ టాస్క్‌లో తన కోసం శ్రమిస్తూ తీవ్ర గాయానికి గురైన నూతన్ నాయుడు పరిస్థితిని తలుచుకొని కౌశల్ కంటతడి పెట్టారు. దీప్తి నల్లమోతు కూడా దు:ఖంలో మునిగిపోయింది. ఇంట్లో అందరూ చాలా బాధలో మునిగిపోవడంతో ఇళ్లంతా నిశబ్దంగా మారింది.