న‌రేష్‌తోనే కృష్ణ‌, ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో ఏం జ‌రిగింది…!

1082

దివంగత లెజెండ్రీ దర్శకురాలు విజయనిర్మల చనిపోయి 20 రోజులు కావొస్తున్నా కూడా ఇంకా ఆ విషాదం నుంచి బయటపడలేకపోతున్నాం. విజయ నిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉన్న ఆమె మరణం సినీ ఇండస్ట్రీలో పెద్ద విషాదం అనే చెప్పుకోవాలి. సామాన్య ప్రజల పరిస్థితే అలా ఉంటె ఆమె భర్త కృష్ణ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోండి.

Image result for krishna and vijaya nirmala

విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ అన్యోన్య దాంపత్యం గురించి తెలిసిందే. అప్పటికే పెళ్ళైన కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన నాటి నుంచి ఇద్దరు ఒకరికి ఒకరుగా జీవించారు. విజయనిర్మల మృతి కృష్ణకు తీరని లోటు అని చెప్పాలి. విజయనిర్మల లేకుండా కృష్ణ ఎలా ఉంటాడని అందరు అనుకుంటున్నారంటేనే అర్థం చేసుకోండి కృష్ణ పరిస్థితి ఎలా ఉంటుందో.. అయితే విజయనిర్మల చనిపోబోయే ముందు కృష్ణతో సంతోషంగా గడిపినట్టు తెలుస్తుంది. తన ఆరోగ్యం క్షీణిస్తుంది అని తెలుసుకున్న విజయనిర్మల భర్తతోనే గడిపింది. అయితే ఒకవేళ నేను చనిపోతే పిల్లలను బాగా చూస్కోండి. నా గురించి దిగులు పడకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మనువళ్లు మానవరాళ్లతో ఎక్కువగా గడపండి అని చెప్పిందంట. ఆ మాటలకూ కృష్ణ ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడంట.

ఈ క్రింది వీడియో ని చూడండి

విజయనిర్మల చనిపోయిన తర్వాత కృష్ణ తన ముగ్గురు కుమారుల్లో ఎవరి దగ్గర ఉంటార‌న్నదానిపై ఘట్టమనేని ఫ్యామిలీలో చర్చ నడిచిందట. మహేష్ బాబు, రమేష్ బాబు మాత్రం త‌మ ఇంటికి రావాలని కోరినా అందుకు కృష్ణ మాత్రం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తనకు విజయనిర్మల ఇంటి తోనే చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారట. ఇక చాలా ఏళ్లుగా కృష్ణ విజ‌య‌నిర్మిల‌ నరేష్‌తో న‌రేష్‌ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు విజ‌య‌నిర్మల మ‌ర‌ణం ఆయ‌న్ను బాగా కుంగ‌దీసింది. కొద్ది రోజులు ఆ ప్లేస్ మారితే త‌మ తండ్రి మ‌న‌స్సు కుదుట‌ప‌డుతుంద‌ని ర‌మేష్‌, మ‌హేష్ భావించినా ఆయ‌న మాత్రం అక్క‌డ నుంచి వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని ఆ ఫ్యామిలీతో స‌న్నిహితంగా ఉన్న‌వారు అంటున్నారు. ఇక ర‌మేష్‌, మ‌హేష్ కూడా తండ్రి నిర్ణ‌యానికి గౌర‌వం ఇచ్చి ఈ విష‌యంలో బ‌ల‌వంతం చేయ‌లేద‌ట‌. అయితే ర‌మేష్‌, మ‌హేష్ మాత్రం ప్ర‌తి రోజు లేదా వీలున్న‌ప్పుడ‌ల్లా తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లి టైం స్పెండ్ చేసి వ‌స్తున్నార‌ట‌. ఏదేమైనా విజ‌య‌నిర్మల మ‌ర‌ణం కృష్ణ‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసినా ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం ఆయ‌న‌కు ఆ బాధ లేకుండా చూసుకుంటున్నారు. మరి కృష్ణ విజయ నిర్మల ఇంటిని వదలకపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.