బిగ్ బాస్ లో అసలు ఫైట్ మొదలైంది..ఇక రచ్చ రచ్చే..

464

బిగ్ బాస్ లో ఇప్పుడు ఒక వీకెండ్ ముగియడంతో మరొక వీకెండ్ మొదలైంది.బాబు ఎలిమినేషన్ ద్వారా కొంచెం ఎమోషన్ అయిన ఇంటి సభ్యులు ఇప్పుడు మళ్ళి ఎవరి గేమ్ లో వాళ్ళు లీనమయ్యారు.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇచ్చిన ఒక సరికొత్త టాస్క్ ఇంటి సభ్యుల మద్య చిచ్చు పెట్టింది.ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేసింది.ఈ ప్రోమోలో ఒకరి మద్య మరొకరికి తీవ్ర వాగ్వాదం నడిచింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for big boss 2 in telugu tanish

బిగ్ బాస్ ఈ వారం కూడా ఎలిమినేషన్ కోసం ఒక టాస్క్ ఇచ్చారు.ఈసారి ఇంటి సభ్యుల మద్య వైరం ఏర్పడేలాగా టాస్క్ ఇచ్చాడు.ఇంతముందు ఒకసారి చేతులకు బేడీలు వేసిన టాస్క్ లాగే ఈసారి ఒక టాస్క్ ఇచ్చారు.ఈ టాస్క్ ప్రకారం ఇద్దరు ఇద్దరు చొప్పున డివైడ్ చేశారు.కౌశల్ గీతా మధురి,గణేష్ రోల్ రైడా,దీప్తి సునైన శ్యామల,నూతన నాయుడు దీప్తి,సామ్రాట్ పూజలను జంటలుగా విడగొట్టారు.ఇక తనిష్ కు కెప్టెన్ కావడం వలన ఈ టాస్క్ నుంచి మినహాయింపు లభించగా కమల్ హసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో వీళ్ళు ఈవారం కూడా సేఫ్ జోన్ లో ఉంటారు.ఈ టాస్క్ ను బట్టి చూస్తే ఇప్పటివరకు ఉన్న స్నేహాలు పోయి సరికొత్త వైరాలు వచ్చే అవకాశం ఉంది.ఈ టాస్క్ గురించి రోల్ రైడా మాట్లాడుతూ తనకు ఇదే చివరి అవకాశం అని భావిస్తున్నా అని ఎంతో ఎమోషనల్ గా అన్నాడు.

Image result for big boss 2 in telugu ganesh

దానికి గణేష్ రిప్లై ఇస్తూ తాను ఇన్నాళ్ళు ప్రూవ్ చేసుకుంది ఒక ఎత్తు ఇప్పుడు ప్రూవ్ చేసుకోబోయేది ఒక ఎత్తు అన్నాడు.ఇలాంటి సమయంలో బయటకు వెళ్ళాలని నాకు లేదని చెప్పాడు.ఇక కౌశల్ గీతా మధురి విషయానికి వస్తే బిగ్ బాస్ టైటిల్ గెలవంటే మెంటల్ గా ఫిజికల్ గా ఎమోషనల్ గా అన్నిట్లో గట్టిగా ఉండాలి.అలాంటి వారికే కొనసాగే అవకాశం ఉందని అలాంటి లక్షణాలు తనలో ఉన్నాయని బావిస్తున్నాను అని కౌశల్ అన్నాడు.అందుకు గీతా బదులిస్తూ తన గురించి తను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కనిపిచడం లేదని అంతమాత్రాన కౌశల్ బయటకు పోవాలని తాను కోరుకోవడం లేదని అలాగని నేను కూడా వెళ్ళాలి అను కోరుకోవడం లేదని చెప్పింది.దానికి రోల్ రైడా కూడా గీతకు మద్దత్తుగా మాట్లాడాడు.ఇక నూతన నాయుడు దీప్తి మద్య కూడా చాలా సేపే వాగ్వాదం నడిచింది.

దీప్తి ఎప్పుడు మాట్లాడిన తనను డౌన్ చెయ్యడానికి మాట్లాడుతుందని నూతన నాయుడు అనగా ఆడియన్స్ తమను ఫాలో అవుతున్నప్పుడు జరిగింది జరిగినట్టు చెప్పాలా లేక అబద్దం చెప్పాలా అనే రెండు విషయాలు తన ముందు నిలిస్తే జరిగింది జరిగినట్టే చెప్పేదానిని అని దీప్తి తన వాదనను వినిపించింది. ఇలాంటి విషయాలు నూతన నాయుడుకు నచ్చవని జరిగిన విషయాలు తను అంగీకరించలేడని అందరితో గొడవ పెట్టుకోవడం అనే విషయం అతని విజ్ఞతకే వదిలేస్తున్న అని చెప్పింది.మరి ఇంత గొడవ జరిగాకా చివరికి ఎవరు ఎవరిని సేవ్ చేశారు.ఎవరు ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ వరకు ఎదురుచుడాల్సిందే.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఎవరు ఇంట్లో ఉండడం కరెక్ట్ ఎవరు వెళ్ళిపోవడం కరెక్ట్.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.