హీరోయిన్ అంజలిపై కేసు నమోదు..కారణం తెలిస్తే షాక్

1156

హీరోలు, హీరోయిన్లు ప్రకటనల్లో నటించడం.. ఆ తర్వాత వాటిని ఫ్యాన్స్ ఫాలో అయిపోవడం చూస్తుంటాం.. కానీ, కొన్ని సార్లు అవి బెడిసికొడుతుంటాయి. ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనలపై వినియోగదారులు కోర్టును ఆశ్రయించగా, తాజాగా టాలీవుడ్‌లో మరొక ఘటన వెలుగుచూసింది. టాలీవడ్ లో ఉన్న అతికొద్ది తెలుగు హీరోయిన్స్ లలో అంజలి ఒకరు. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి తొలిసారి ‘ఫొటో’ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే.. ఆ సినిమా ఆమెకు ఆశించినంత పేరును మాత్రం తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూపర్ హిట్టైన అంగడి తెరు తెలుగు డబ్బింగ్ షాపింగ్ మాల్ సినిమాతో మంచి పేరును తెచ్చుకుంది. ఆ తర్వాత జర్నీ సినిమాతో మరింత గుర్తింపును కోలీవుడ్‌లో దక్కించుకుంది ఈ తెలుగు భామ. ఆ తరువాత తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్ సరసన నటించి పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 2016లో బాలకృష్ణ సరసన డిక్టేటర్‌ సినిమాలో కథానాయికగా నటించింది. స్టైలిష్‌ స్టార్‌ బన్నీతో ‘సరైనోడు’లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది.

Related image

అయితే ఇప్పుడు హీరోయిన్ అంజలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కల్తీ వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ వంట నూనెను తాము ల్యాబ్‌కి పంపించి టెస్టులు చేయించగా హానికరం అని తేలిందన్నారు. ఇలాంటి వంట నూనెలు విక్రయించడం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమేనన్నారు. దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అంజలి ఒకరకంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏ క్షణమైనా ఆమె మీద కేసు పెట్టి కోర్ట్ కు పంపించవచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇది ఇలా ఉంటె నటీనటులకు ఇలాంటి విషయాలలో కోర్ట్ నోటీసులు రావడం ఇదే మొదటిసారి కాదు. మొన్నీమధ్యనే బయటపడ్డ మ‌ల్టీలెవ‌ల్ మార్కెటింగ్‌లో క్యునెట్ మోసం గురించి తెలిసిందే. క్యునెట్ ను ప్రమోట్ చేసినందుకు షారుక్‌ ఖాన్, బొమన ఇరానీ, అల్లువారి అబ్బాయి అల్లు శిరీష్‌, పలువురు క్రికెట‌ర్లు ఉన్నారు. వీరందరికి కూడా నోటీసులు అందాయి. అలాగే విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం రాశి, రంభ నటించిన ఓ వాణిజ్య ప్రకటనను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘వెయిట్ లాస్’ ప్రొడక్ట్ పేరుతో వారు నటించిన ఆ ప్రకటన ద్వారా చాలామంది మోసగించబడ్డారన్న ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఆ తీర్పునిచ్చింది. ఇప్పుడు అంజలి కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఏదిఏమైనా హీరోలు, హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్‌లో నటించేముందు కాస్త వాటి వివరాలు తెలుసుకుంటే మంచిందని జనం అభిప్రాయపడుతున్నారు. లేదంటే చాలామంది గుడ్డిగా ఆ యాడ్స్‌ను నమ్మి మోసపోతున్నారని వాపోతున్నారు. మరి అంజలిపై వచ్చిన పిర్యాదు మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి