లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ఎందుకు ఎందుకు లక్ష్మి పార్వతి ఎందుకు’

210

రెండు తెలుగు రాష్టాల్లో ఇప్పుడు ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అదే ఎన్టీఆర్. ఈయన జీవిత చరిత్ర మీద ఇప్పుడు రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి బాలయ్య తీస్తుంటే మరొకటి ఆర్జీవీ తీస్తున్నాడు.ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని బాలయ్య తీస్తుంటే.. బాలయ్య చూపించని లక్ష్మి పార్వతి జీవితం గురించి వర్మ తీస్తున్నాడు.

Image result for lakshmis ntr

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాలకృష్ణ రూపొందించే ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించని ఎన్నో సన్నివేశాలు తన బయోపిక్‌లో చూపిస్తానని వర్మ చెప్తున్నాడు. ఈ క్రమంలో సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను ఇదివరకే రిలీజ్ చేసి సినిమా ఏ విధంగా ఉంటుందో అందరికి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మరొక సాంగ్ రిలీజ్ చేశాడు.ఎందుకు ఎందుకు అంటూ జయసుధ, జయప్రధ, శ్రీదేవి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ.. సీబీఎన్‌, ఎన్‌బీకే, దగ్గుబాటి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ ఎన్నో కోణాల్లోంచి ప్రశ్నలను సంధించారు.

అంతేనా.. ఈ పాట చివర్లో తన గాత్రంతో ఉన్న సంభాషణలు వింటే కొందరికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ధ్యేయం. ఇరవై సంవత్సరాలకి పైగా నిజానికి అబద్దమనే బట్టలు తొడిగి.. వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటు దారుల అందరి బట్టల్ని ప్రజల కళ్ల ముందు చింపి అవతలపారేసి.. నిజం బట్టల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా విప్పి .. దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఉద్దేశం’ అంటూ వర్మ తన స్టైల్లో చెప్పాడు. సిరాశ్రీ ఈ పాటను రాయగా.. కళ్యాణీ మాలిక్‌, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.