చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ

220

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి వివాదమే. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వర్మ తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరవాత జరిగిన పరిణామాలు.. లక్ష్మీ పార్వతి మూలంగా ఎన్టీఆర్‌కు ఆయన కుటుంబం దూరమైన విధానం.. చంద్రబాబు నాయుడు చేసిన మోసం.. ఇవే ప్రధాన కథాంశాలుగా చేసుకుని వర్మ ఈ సినిమాను తీశారు. ‘వెన్నపోటు’ అనే ఆయుధంతో ఈ సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మరి ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఎలా ఉందొ చూద్దామా.

Image result for lakshmis ntr

కథ విషయానికి వస్తే.. అప్పటికే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు జీవిత కథ రాస్తా అని లక్ష్మి పార్వతి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆమెను చాలా అభిమానిస్తారు. ఆమె యాటిట్యూడ్ ఎన్టీఆర్ కు బాగా నచ్చి ఆమెతో సన్నిహితం పెంచుకుంటాడు. ఒకవైపు కుటుంబం మరొక వైపు ఎన్టీఆర్ జీవిత కథ రాసే పనిలో లక్ష్మి పార్వతి నిమగ్నమై ఉంటుంది. అలాంటి సమయంలో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కు దగ్గరవుతుంది అని ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్లు ఎన్టీఆర్ ను పట్టించుకోవడం నానా మాటలు అనడం మొదలుపెడతారు. అప్పుడు ఎన్టీఆర్ మనసు విరిగిపోయి ఒంటరివాడు అవుతాడు. అలాంటి సమయంలో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కు దగ్గరవుతుంది. ఆ తరువాత ఆమె తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా అవుతుంది. ఎన్టీఆర్ తో పని ఉంటె ముందు లక్ష్మి పార్వతి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు నచ్చదు. అందుకే లక్ష్మి పార్వతిని తిడతారు.

Image result for lakshmis ntr

మీడియాలో కూడా ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతికి సంబంధం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ మాటలన్నీ ఎన్టీఆర్ చెవిన పడటం కుటుంబ సభ్యులు కూడా తోడుగా లేకపోవడంతో ఎన్టీఆర్ ఒంటరిగా ఫీల్ అయ్యి తనకు ఒక తోడు ఉండాలని లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులు అందరు ఎన్టీఆర్ కు దూరం అవుతారు ఒక్క చంద్రబాబు తప్ప. ఆయన సన్నిహితంగా ఉంటూనే టీడీపీ ఎమ్మెల్యేలను తన చేతుల్లోకి తీసుకుంటాడు. లక్ష్మి పార్వతిని విలన్ చేసి అందరు ఎమ్మెల్యేలను తన గుప్పిట్లో పెట్టుకుని పార్టీ హక్కులన్నీ తనకు దక్కేలా చేసుకుంటాడు. వైస్రాయ్ హోటల్ లో జరిగిన సీన్ అయితే సినిమాకు హైలెట్. అక్కడే చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచాడో అర్థం అవుతుంది. తండ్రి అనారోగ్యంతో ఉన్నా కూడా కొడుకుకు కూతుళ్లు పట్టించుకోరు. లక్ష్మి పార్వతి ఒక్కతే ఆయనకు సేవలు చేస్తుంది. చంద్రబాబు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఎన్టీఆర్ చనిపోతాడు. ఇలా కథ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక సినిమాను విశ్లేషించాల్సి వస్తే..రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ ఇంక్రెడబుల్.. ఇదొక మోస్ట్ ఇంటెన్స్ డ్రామా. యజ్ఞశెట్టి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్యాణిమాలిక్ తన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరుతో సినిమాకు వెన్నుముఖలా నిలిచారు. సినిమా ముగింపు అందరూ షాకయ్యేలా ఉంటుంది.అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్టాఫ్ కొంచెం బోరింగ్ అనేలా ఉంది. సిబిఎన్ సీన్లు పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు. తెలుగుదేశం పార్టీని, సిబిఎన్‌ను వ్యతిరేకించే వారు కూడా ఈ సినిమాను చూడటం కష్టం. కొన్ని ఎమోషనల్ సీన్లు, చంద్రబాబుపై డైలాగులు బావున్నాయి. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. సిబిఎన్‌ను బిగ్గెస్ట్ కన్నింగ్ యాక్టర్‌గా చూపించారు.

Image result for lakshmis ntr

ప్లస్ పాయింట్స్ : ఆర్జీవీ డైరెక్షన్, మ్యూజిక్, ఎన్టీఆర్ పాత్రధారి నటన, యజ్ఞశేట్టి నటన, స్టోరీ, స్క్రీన్ ప్లే..
మైనస్ పాయింట్స్ : సినిమా మొత్తం లక్ష్మి పార్వతి చుట్టూనే తిరగడం, కొంచెం బోరింగ్ సన్నివేశాలు

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.5/5