సినిమా చూసొచ్చిన తర్వాత లక్ష్మి పార్వతి చంద్రబాబును, బాలయ్యను ఎలా తిడుతుందో చూస్తే షాక్..

378

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image result for lakshmi parvathi

ఒక్క ఏపీలో తప్పా అన్ని చోట్ల ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది అని టాక్ వచ్చింది. వర్మ సినిమాను తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక లక్ష్మి పార్వతి పాత్ర పోషించిన యజ్ఞశేట్టి కూడా మంచి నటనను కనపరిచాడు. ఇక చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ కూడా మంచిగానే నటించాడు. కుళ్ళు కుతంత్రాలను వర్మ చాలా చక్కగా చూపించాడు. వైస్రాయ్ హోటల్ ఘటనను పార్టీని చంద్రబాబు లాక్కున్న విధానాన్ని లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను ఎందుకు పక్కన పెట్టారు లాంటి విషయాలను బాగా చూపించారు ఆర్జీవీ. అయితే ఈ సినిమా మీద సామాన్య ప్రేక్షకులకే కాదు సినీ సెలెబ్రెటీలకు కూడా ఆసక్తి ఉంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ సినిమా చూశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ సినిమాను లక్ష్మి పార్వతిగారు చూశారు. ఆమె ఈ సినిమాను చూసి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా జీవితానికి ఇప్పుడు అర్థం వచ్చింది. ఇన్నిరోజులు జనాలు నన్ను తప్పుగా అనుకునేవారు కానీ అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు అందరికి తెలిశాయి. చంద్రబాబు ఎన్టీఆర్ గారిని ఎలా వెన్నుపోటు పొడిచారు ఆయన చనిపోడానికి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు ఎలా కారణం అయ్యారో ఇన్ని రోజులు జనాలకు తెలీదు కానీ ఇప్పుడు తెలిశాయి. ఎన్టీఆర్ చనిపోడానికి చంద్రబాబు ఎంత కారణమో ఆయన కొడుకులు కూతుళ్లు కూడా అంతే కారణం.ఆర్జీవీ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ దేవుడే ఆర్జీవీ రూపంలో వచ్చాడు. మా ఆయన మీద అర్జీవికి ఉన్న అభిమానమే ఈ సినిమా తీసేలా చేసింది. 25 ఏళ్ల తరవాత జరిగిన నిజం ప్రజలకు తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది అని లక్ష్మి పార్వతి ఎంతో భావోద్వేగంగా చెప్పింది.మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి లక్ష్మి పార్వతి చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.