యాక్ట‌ర్ అవ్వాల్సిన ల‌క్మీ పార్వ‌తి కొడుకు డాక్ట‌ర్ ఎలా అయ్యాడు హీరోయిన్ రాశితో మొద‌లైన సినిమా తెలుసా

1051

ల‌క్ష్మీ పార్వ‌తి అంటే తెలియ‌ని వారు ఉండ‌రు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఓ మ‌కుటం లేని మ‌హారాజుగా వెలుగువెలిగిన ఎన్టీఆర్ ను, ఆమె రెండో వివాహం చేసుకున్నారు.. సాధార‌ణ స్త్రీ అయిన ఆమెని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోవ‌డం, అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం అనే చెప్పాలి. ఇక నంద‌మూరి కుటుంబం నుంచి ఆమెని ఎప్పుడూ ప‌క్క‌న పెడుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ ని ఆమె రెండో వివాహం చేసుకోవ‌డంతో నంద‌మూరి కుటుంబం అల్ల‌క‌ల్లోలం అయింది. ఎన్టీఆర్ బంధువులు ఎవ‌రూ కూడా ఆమెని త‌మ కుటుంబంలో క‌లుపుకోలేదు.. కాని లేటు వ‌య‌సులో ఎన్టీఆర్ తాను తీసుకున్న నిర్ణ‌యానికి ఆయ‌న క‌ట్టుబడి ఉన్నారు.

Image result for lakshmi parvathi son

మేజ‌ర్ చంద్రకాంత్ సినిమా స‌మ‌యంలో తాను రెండో వివాహం చేసుకుంటున్నాను అని ప్ర‌క‌టించి ,మొద‌టి సంచ‌ల‌నానికి తెర‌లేపారు ఎన్టీఆర్.. ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆమెని రెండో పెళ్లి చేసుకోవ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు.. ఎన్టీఆర్ ఇలా ఎందుకు చేశారు అని కొంద‌రు ఆలోచించారు, అయితే లక్ష్మీపార్వ‌తి అప్ప‌టికే ఓ సాధార‌ణ లెక్చ‌ర‌ర్.. ఆమెకి అప్ప‌టికే పెళ్లి అయి ఒక కుమారుడు కూడా ఉన్నారు, ఆమె మొద‌టి భ‌ర్త పేరు వీర‌గ్రంధం వెంక‌ట సుబ్బారావు.. ఆయ‌న జాతీయ స్ధాయిలో పేరు పొందిన హ‌రిక‌ధ‌కళాకారుడు..ఆయ‌న‌కు హ‌రిక‌థా భాగ‌వ‌తంలో ఎన్నో అవార్డులు కూడా ల‌భించాయి. భ‌ర్త‌తో క‌లిసి ఆమె అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. దూర‌ద‌ర్శ‌న్ లో కూడా హ‌రిక‌థా క‌ళాపం చేసి అంద‌రిని అల‌రించారు ఈ జంట‌.

Related image

కాని ఆయ‌న కూత‌ళ్లు కుమారులు ఎవ‌రూ ఒప్పుకోలేదు. చివ‌ర‌కు ఆయ‌న పెళ్లి చేసుకున్నారు.. పెళ్లికి ముందు సుబ్బారావుతో త‌న‌కు ఇష్టం లేకుండా పెళ్లిచేశార‌ని ఆయ‌న‌కు విడాకులు ఇచ్చింది ల‌క్ష్మీ పార్వ‌తి, ఆయ‌న‌తో కాపురం ఇష్టం లేకుండా చేశాను అని ఆమె అనేక ఇంట‌ర్వూల‌లో చెప్పారు.. ఇక విడాకులు తీసుకునే స‌మ‌యంలో ఆమె కొడుకు చ‌దువుకుంటున్నారు. అత‌ని పేరు కోటేశ్వ‌ర ప్ర‌సాద్ ఆయ‌న ఐదు సంవ‌త్స‌రాల‌కే భ‌గ‌వ‌ద్గీత పాటాలు చ‌దివేశాడు.. ఇలా అనేక అవార్డులు తీసుకున్నాడు.. త‌ర్వాత చ‌దువులో కూడా ఎంతో బాగా చ‌దివి డాక్ట‌ర్ అయ్యారు.. ఇప్పుడు దేశంలో ప్ర‌ముఖ డాక్ట‌ర్ల‌జాబితాలో ఆయ‌న ఒక‌రిగా ఉన్నారు, ఎముక‌ల డాక్ట‌ర్ గా ఆయ‌న పేరు సంపాదించారు. ఆయ‌న డాక్ట‌ర్ అవ్వ‌డానికి ముందే యాక్ట‌ర్ అయ్యే అవ‌కాశం వ‌చ్చింద‌ట ఇది కొంద‌రిక మాత్ర‌మే తెలిసిన విష‌యం. ల‌క్ష్మీ పార్వ‌తి కుమారుడు ఎన్టీఆర్ లాగా పెద్ద న‌టుడు అవ్వాల‌ని భావించార‌ట‌…

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కోటేశ్వ‌ర ప్ర‌సాద్ చ‌క్క‌ని రూపంతో అంద‌గాడు కావ‌డంతో ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ కోటేశ్వ‌ర‌ప్ర‌సాద్ తో ఓ సినిమా చేయాల‌ని అనుకున్నారు..అప్ప‌టికే ఇంట‌ర్ చ‌దువుతున్నాడ‌ట‌, ఇక ఈ విష‌యంలో ఎన్టీఆర్ కూడా సినిమా తీయ‌మ‌ని స‌పోర్ట్ ఇచ్చార‌ట‌, ఇక ఈ సినిమాలో హీరోయిన్ రాశిని కూడా ఫిక్స్ చేశారు ..అయితే ఈ స‌మ‌యంలో ఇద్ద‌రూ చెన్నై వెళ్లి స్క్రీన్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఇక సినిమా మ‌రో వారంలో ఆరంభిస్తాం అనేస‌రికి ఒక్క‌సారిగి ఎన్టీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయింది. దీంతో అప్పుడు అంద‌రూ ల‌క్ష్మీ పార్వ‌తి కార‌ణం అని నిందించారు.. ఈ స‌మ‌యంలో ఆమె కుమారుడు సినిమా రంగ‌ప్ర‌వేశం మంచిది కాదు అని కొంద‌రు పెద్ద‌లు ఈ సినిమాని వెన‌క్కి పెట్టేశారు.త‌ర్వాత ప‌రిణామాల‌తో ఆమె కుమారుడు బాగా చదువుకుని యాక్ట‌ర్ అవ్వాల్సిన వ్య‌క్తి డాక్ట‌ర్ అయ్యార‌ట‌. మ‌రి చూశారుగా
త‌న కొడుకు ప్ర‌యోజ‌కుడు అవ్వ‌డం పై, ఆమె ఎన్నోసార్లు త‌న సంతోషాన్ని తెలియ‌చేశారు.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.