‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పై లక్ష్మీపార్వతి కామెంట్స్

205

ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అయ్యింది.. భారీ అంచనాల నడుమ ఈ బయోపిక్ మొదటిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈరోజు మన ముందకు వచ్చింది. విడుదల అయినా అన్ని చోట్ల విజయడంకా మోగిస్తుంది.

Image result for ntr biopic

ఎన్టీఆర్ జీవితంలో ఉన్న ముఖ్య ఘట్టాలను చాలా చక్కగా చూపించారు.ఈ సినిమాను చూసిన సినీ, రాజకీయ ప్రముఖులు సినిమాపై తమ అభిప్రాయాలను పంచకుంటున్నారు.

 

Image result for lakshmi parvathi

తాజాగా ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి స్పందించారు.‘‘ఎన్టీఆర్ బయోపిక్‌ను చూడమని నన్నెవరూ ఆహ్వానించలేదు. చంద్రబాబు కనుసన్నలలోనే ఈ బయోపిక్ రూపొందింది. అందువలన ఎన్టీఆర్‌కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు. ఈ కారణంగానే జనంలోనూ.. నిజమైన అభిమానుల్లోనూ ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి లేదు. అందరూ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను రూపొందించే ధైర్యం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే ఉంది” అని ఆమె స్పష్టం చేశారు.