నిర్మాత క‌ల్యాణ్ కు ప్ర‌భుదేవా సినిమా

377

డ్యాన్స్ కింగ్ అంటే వెంట‌నే గుర్తువ‌చ్చేది ప్ర‌భుదేవా… న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్, క‌మ్ , ద‌ర్శ‌కుడు అన్ని క్రాప్ట్స్ లో ఆయ‌న‌కు అనుభ‌వం ఉంది… తాజాగా న‌టుడు ప్రభుదేవా, దిత్య బందే ప్రధాన పాత్రల్లో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మి…. ఈ సినిమా పై ఇప్ప‌టికే ఎన్నో హూప్స్ పెంచుకున్నారు కోలీవుడ్ సినిమా ప్ర‌జ‌లు… ఈ చిత్రం డ్యాన్స్ బేస్ గా న‌డిచే క‌థాంశం.

Image result for producer kalyan
ఈ సినిమాకు ఏ ఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.. ఇక తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది…ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేయనున్నారట‌.
సామ్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, కరుణాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Image result for producer kalyan and prabhu devaఇక తమిళంలో విడుద‌లైన చిన్న చిత్రాలు ఘ‌న‌విజ‌యం అందుకుంటున్నాయి… అలా విజ‌యం సాధించిన వాటిని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు .. అలా ఎక్కువ‌గా తెలుగులోకి కోలీవుడ్ సినిమాలు తీసుకువ‌స్తుంది నిర్మాత సి. క‌ల్యాణ్… తాజాగా ఆయ‌న ఈ సినిమాని కూడా విడుద‌ల చేస్తారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలి ఈ సినిమా తెలుగులో ఎటువంటి టాక్ తెచ్చుకుంటుందో..