‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండవ పాట ” ఎందుకు” సిద్ధం చేసిన వర్మ

230

రెండు తెలుగు రాష్టాల్లో ఇప్పుడు ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అదే ఎన్టీఆర్. ఈయన జీవిత చరిత్ర మీద ఇప్పుడు రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి బాలయ్య తీస్తుంటే మరొకటి ఆర్జీవీ తీస్తున్నాడు.ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని బాలయ్య తీస్తుంటే.. బాలయ్య చూపించని లక్ష్మి పార్వతి జీవితం గురించి వర్మ తీస్తున్నాడు.

Image result for lakshmis ntr vennupotu song

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాలకృష్ణ రూపొందించే ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించని ఎన్నో సన్నివేశాలు తన బయోపిక్‌లో చూపిస్తానని వర్మ చెప్తున్నాడు. ఈ క్రమంలో సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను ఇదివరకే రిలీజ్ చేసి సినిమా ఏ విధంగా ఉంటుందో అందరికి ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు ‘ఎందుకు’ అనే రెండోపాట విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి 8 సాయంత్రం 5 గంటలకు ‘ఎందుకు’ పాట విడుదల చేయబోతున్నామని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు వర్మ. దీంతో.. మొదటిపాట సృష్టించిన ప్రకంపనలు మరవక ముందే మరోపాట విడుదల చేస్తున్న వర్మ ఈ సారి మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడో! అంటున్నారు జనం.