న‌మిత‌కు కొత్త అవ‌కాశం ఈసారి సీన్ మారుతుంది

481

న‌మిత అంటే త‌మిళ‌నాట ఓ మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్.. ఇటు పెళ్లి అయిన త‌ర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తూ అల‌రిస్తోంది ఇటు అభిమానుల‌ను.. తాజాగా ఆమె టీ రాజేంద్ర‌న్ తో ఓ సినిమా చేస్తున్నారు.. ఆ విష‌యాలు ఓసారి ప‌రిశీలిస్తే….టీ.రాజేంద్రన్‌ చాలా గ్యాప్‌ తరువాత మళ్లీ మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అయ్యారు అని తెలుస్తోంది.

Lady Don As Namitha Her Next Movie - Sakshi

ఇంతకు ముందు ఒరు తాయిన్‌ శపథం, ఎన్‌ తంగై కల్యాణి, సంసార సంగీతం, ఇంగవీట్టు వేలన్, మోనీషా ఎన్‌మోనాలిసా, సొన్నాల్‌దాన్‌ కాదలా, తన కొడుకు శింబును హీరోగా పరిచయం చేస్తూ కాదల్‌ అళివదిల్లై వీరాస్వామి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శింబు సినీ ఆర్ట్స్‌ సంస్థ ద్వారా టీ.రాజేందర్‌ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రానికి ఇన్రైయ కాదల్‌ డా అనే పేరును నిర్ణయించారు.

ఇక దీనికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టీఆర్‌నే నిర్వహించనున్నారు. ఇది ఇక్క‌డ చ‌ర్చించుకుటున్న అంశం ఇందులో లేడీ డాన్ గా న‌మిత న‌టిస్తున్నార‌ట‌.ఆమెతో పాటు ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు కొత్త‌న‌టులు కూడా ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నారు అని తెలియ‌చేశారు చిత్ర బృందం.

Image result for namitha

ఇది పూర్తిగా యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా ఉంటుందని, ఇప్ప‌టి తరానికి తగ్గట్టుగా ప్రేమ,ప్రేమ,ప్రేమ మినహా వేరేదేదీ ఉండదని టీఆర్ పేర్కొన్నారు. మ‌రి చూడాలి ఇప్ప‌టికే ఆమెకు గుడిక‌ట్టే అంత అభిమానం ఉన్న ఫ్యాన్స్, న‌మిత‌కు ఉన్నారు కోలీవుడ్ లో.. ఈ సినిమాతో ఆమె ఇంకెంత క్రేజ్ పెంచుకుంటారో.