శ్రీరెడ్డికి అవకాశమిస్తా బడా నిర్మాత ప్రకటన..

510

కాస్టింగ్ కోచ్ వ్యవహారం ద్వారా బాగా ఫేమస్ అయినా నటి శ్రిరెడ్డి.కొన్ని రోజులు ఆరోపణలు ఆపేసిన ఈమె ఈ మద్య తమిళ ఇండస్ట్రీ మీద పడింది.వరుసగా ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.అయితే శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ ఆమెకు అవకాశం ఇచ్చినా, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే భయంతో ఆమెను దూరంగా ఉంచుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమెకు ఓ బడా నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చారు.అవకాశం ఇస్తామని అక్కున చేర్చుకున్నారు.ఆ నిర్మాత మరెవ్వరో కాదు అందాల నటి శ్రీదేవి బాల్య స్నేహితురాలు, ప్రముఖ నటి కుట్టి పద్మిని.బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన కుట్టి పద్మిని.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో 25 పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సీరియల్, వెబ్ సీరీస్‌ల నిర్మాతగా బిజీగా ఉన్నారు.

కుట్టి పద్మిని ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ..ఒకరు ఇద్దరు మోసం చేసినప్పుడే శ్రీరెడ్డి అప్రమత్తమై ఒక గిరి గీసుకుని ఉండాల్సింది. మిగతావారికీ అలాంటి అవకాశాన్ని ఇచ్చి ఉండకూడదు అని పద్మిని అభిప్రాయపడ్డారు. తాను నిర్మిస్తున్న సీరియళ్లు, వెబ్‌ సీరీస్‌లలో శ్రీరెడ్డికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఇందుకు శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఆమెకు ధన్యవాదాలు తెలిపింది.