హీరోయిన్ గా ఉన్న సమయంలో బయటపడ్డ కుష్బూ నిజస్వరూపం..షాక్ లో కుటుంబం

503

బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కుష్బూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ హీరోయిన్ అయింది. ఆమె రాజ‌కీయాల్లో ఎంతో ఫేమ‌స్ అలాగే సినిమాల్లో కూడా అంతే పేరు తెచ్చుకున్నారు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు త‌మిళ చిత్రాల్లో ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది.19వ ద‌శ‌కంలో కుష్బూకి యువ‌త‌రం అంతా ఫ్యాన్స్ గా ఉండేవారు.1970 సెప్టెంబర్ 29న ముంబయిలో జన్మించింది ఈ హీరోయిన్ . ముస్లిం దేశంలో పఠాన్ లంటే వీరులని అర్ధం. అలాంటి పఠాన్ ల వంశానికి చెందిన ఆఫ్ఘనీ స్థాన్ వాసులు కుష్భు పేరెంట్స్ . కుష్బూ అసలుపేరు నఖత్ ఖాన్. 1980లో బాలీవుడ్ లో వచ్చిన బర్నింగ్ ట్రైన్ మూవీ కుష్బూ కెరీర్ లో తొలిచిత్రం. ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 1985వరకూ బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించింది. ఇక హేమ‌మాలినీ ద్వారా సినిమాల్లోకి వ‌చ్చింది ఖుష్బూ, ఆమె ఇళ్లు హేమ‌మాలిని ఇంటి ప‌క్క‌న ఉండేద‌ట‌, ఈ స‌మ‌యంలో చిన్న త‌నంలో హేమ‌మాలిని ఆమెని సినిమాల్లో న‌టించేందుకు తీసుకువ‌చ్చారు అని అంటారు.

Image result for కుష్బూ

ఇక తండ్రి ఓ శాడిస్టు కావడంతో నిత్యం నరకం చూసిన కుష్బూ 8ఏళ్ళ వయస్సు నుంచి సినిమాల్లో నటించింది. అలా సంపాదించిన సొమ్ములను తీసేసుకోవడమే కాదు,ఆమెను,తల్లిని కూడా తండ్రి వేధించేవాడు. అంతేకాదు భిక్షాటన చేసి డబ్బులు తీసుకురమ్మని హింసపెట్టేవాడు. ఇక 1986లో సినిమాలు చేసే సమయంలో కాళ్ళు లేనిదానిలా పాక్కుంటూ వెళ్లి డబ్బులు అడుక్కుని తెమ్మన్నాడట. ఇలా త‌న జీవితంలో త‌న తండ్రి వ‌ల్ల ఆమె ప‌డిన బాధ‌లు ఎన్నో ఉన్నాయి అని చెబుతారు కుష్బూ.దాంతో తల్లిని,సోదరుడిని తీసుకుని కుష్బూ బయటకు వచ్చేసింది. టీనేజ్ లో సహాయ నటిగా ఛాన్స్ లు వచ్చాయి. ఇక హీరోయిన్ గా జాకీ ష్రాఫ్ తో జాను మూవీలో చేసింది. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కుష్భు 1986లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కలియుగ పాండవులు మూవీతో తెలుగు తెరపై హీరోయిన్ గా మెరిసింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో నాగార్జునతో కెప్టెన్ సినిమాలో చేసి, తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. త‌ర్వాత సినిమా రంగంలో వ‌రుస‌గా వ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది… అనేక సినిమాలు ఆమెకు నేరుగా ఆఫ‌ర్ల రూపంలో వ‌చ్చాయి.

ఈ క్రింది వీడియో చూడండి

మరోవైపు తల్లిని,సోదరుడిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇక భర్త సుందర్ కూడా సహృదయుడు కావడంతో అందరూ కల్సి మెలిసి హ్యాపీ గా ఉంటున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన కుష్బూ, అభిమానుల పాలిట ఆరాధ్య దైవంగా మారింది. ఆ విధంగా తండ్రి వలన పడ్డ కష్టాలను అభిమానుల కారణంగా బాధలను మరిచిపోయింది. తమిళంలో ఆమెకు ఏకంగా గుడి కట్టేసారు. అంతేకాదు అప్పట్లో మెత్తగా ఉండే ఇడ్లిలకు కుష్బూ ఇడ్లి అని పేరు పెట్టేసి అమ్మేవారు. ముఖ్యంగా ఆమె త‌న‌పై త‌మిళ అభిమానులు చూపించే ప్రేమ‌ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోను అని చెబుతూ ఉంటారు. మ‌రి చూశారుగా క‌ష్బూ గురించి ఈ వీడియోలో, మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.