బర్త్ డే విషెస్ చెప్పిన అఖిల్‌కి స్వీట్ పంచ్ ఇచ్చిన కేటిఆర్ 

415

నిన్న కేటిఆర్ బర్త్ డే అని మన అందరికి తెలుసు.కేటిఆర్ బర్త్ డే సందర్భంగా మంగళవారం కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు పోటెత్తాయి.సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులే కాకుండా సామాన్యులు సైతం మంత్రికి విషెస్ తెలిపారు.

చాలా మందికి కేటీఆర్ బదులిచ్చారు.అందరికి థాంక్స్ చెప్పాడు.అయితే కొంచెం ఫీవర్ ఉండడం వలన ఎక్కువగా కలుసుకోలేపోతున్నాను అని తెలిపాడు.అయితే కేటిఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన అక్కినేని అకిల్ కు మాత్రం ఒక స్వీట్ పంచ్ లాంటిది ఇచ్చాడు. హ్యాపీ బర్త్ డే సార్. మా యంగ్ స్టార్స్‌ అందరికీ మీరు స్ఫూర్తి అంటూ.. మంగళవారం కేటీఆర్‌కి అఖిల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

దీనికి కేటీఆర్ ఫన్నీగా బదులిచ్చారు. నేను ఇక ఎంత మాత్రం యంగ్ కాదని అంటున్నావా..? థ్యాంక్స్ అఖిల్ అంటూ మంత్రి రిప్లయ్ ఇచ్చారు.