గూడాచారి సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించిన మంత్రి కేటీఆర్..ఏమని ట్వీట్ చేశాడో చూడండి..

419

కేటీఆర్ తనకు ఏ విషయం నచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభినందిస్తారు.ప్రతి విషయాన్నీ ప్రజలకు చేరువయ్యేలా సోషల్ మీడియాను వాడుకోవడం కేటీఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి.ఇక ముఖ్య విషయానికి వస్తే ఈ మద్య విడుదల అయ్యి అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది గూడాచారి సినిమా అనే చెప్పుకోవాలి.

ఈ సినిమా మీద అందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.సెలెబ్రిటిలు ఈ సినిమా చూసి చాలా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ సినిమా చూసి తన అభినందనలను తెలియజేశారు.మంత్రి కేటీఆర్ గూఢచారి మూవీ, హీరో అడవిశేష్‌పై ప్రశంసలు కురిపించారు.

‘గూఢచారి’ సినిమా చూసిన ఆయన చాలా బాగుందని ట్వీట్ చేశారు. తెలుగులో రూపొందించిన ది బెస్ట్ స్పై థ్రిల్లర్ అంటూ పేర్కొన్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించిన చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. చాలా రోజలు తర్వాత ఓ మంచి సినిమా చూశానని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు సినీ సెలబ్రెటీస్‌ ప్రశంసలు కురిపించారు.