సిద్దమవుతున్న కృష్ణ బయోపిక్..సుదీర్ బాబు ప్రకటన..

321

టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు తెరకేక్కుతున్నాయి.సావిత్రి బయోపిక్ పెద్ద హిట్ అవ్వడంతో వరుసగా బయోపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి.ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది తెలిసిన విషయమే.అలాగే వైఎస్ఆర్ బయోపిక్ కూడా తెరకెక్కుతుంది.అక్కినేని నాగేశ్వర రావు గారి జీవితం ఆధారంగా సినిమా చేసే ఆలోచనలో అక్కినేని కుటుంబం ఉన్నట్టుగా సినీ విశ్లేషకుల సమాచారం.

Image result for ntr biopic

ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ కూడా తెరకేక్కబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన హీరో ఎవరు అంటే అది సూపర్ స్టార్ కృష్ణ అనే అంటారు.కౌబాయ్ సినిమాలను తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేసింది సూపర్ స్టార్ కృష్ణానే. కలర్, స్కోప్ ఇలా ఎన్నో మార్పులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ పేరు తెచ్చుకున్నారు.

Related image

500 పైచిలుకు సినిమాల్లో ఈయన నటించారు.ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయబోతున్నారట ,ఈ విషయాన్ని కృష్ణ అల్లుడు హీరో సుదీర్ బాబు వెల్లడించారు,అయితే , ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సుదీర్ బాబు పేర్కొన్నారు.చూడాలి మరి రానున్న కాలంలో ఇంకా ఎవరెవరి బయోపిక్ లు తెరకేక్కుతాయో.