క్రేజీ కాంబినేషన్.. క్రిష్ దర్శకత్వంలో మహేష్, అల్లు అరవింద్ చిత్రం!

263

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు దర్శకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ మహేష్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. మహేష్ ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి దాదాపుగా పూర్తి కానుంది. ఆ తరువాత సుకుమార్ దర్శత్వంలో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగకు కూడా మహేష్ బాబు మాట ఇచ్చాడు.

Image result for mahesh babu allu aravind

ఈ సినిమా వార్తలన్నీఇలా ఉండగానే మహేష్, అల్లు అరవింద్ కాంబినేషన్ లోని చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా నిర్మాత అల్లు అరవింద్ మహేష్ బాబుతో భారీ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ పై అంచనాలు పెంచేలా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

బాలయ్య దర్శకుడు
మహేష్, అల్లు అరవింద్ చిత్రానికి దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి పేరు వినిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. చాలా ఏళ్లుగా క్రిష్ మహేష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు అరవింద్ రూపంలో మహేష్ ని డైరెక్ట్ చేసే అవకాశం క్రిష్ కు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్.ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.