నానికి కౌశల్ ఆర్మీ సీరియస్ వార్నింగ్.. అవన్నీ బయటపెడతాం

498

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై ఇప్ప‌టి వ‌ర‌కూ ట్రోల్ జ‌ర‌గ‌డం చూశాం కాని ఇప్పుడు ఏకంగా షోని హోస్ట్ చేస్తున్న నాని పై స‌టైర్లు విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా రాత్రి నుంచి ట్రోల్ అవుతున్నాయి.. హౌస్ అంతా కౌశ‌ల్ ని టార్గెట్ చేస్తున్నారు.. ఇక ఇప్పుడు నాని కూడా కౌశ‌ల్ ని టార్గెట్ చేశాడు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు ట్వీట్ల‌తో కౌశ‌ల్ ఆర్మీ….బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం కౌశల్ ప్రవర్తించిన తీరుని తప్పుబట్టిన నాని..త‌న తీరు మార్చుకుంటే మంచిదని హెచ్చరించాడు. దీంతో.. ఇప్పుడు నానీని లక్ష్యంగా చేసుకుని కౌశల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలోనూ ఇలానే ఓ సారి నాని బిగ్‌బాస్ హోస్ట్‌గా పనికిరాడంటూ ట్రోల్ చేశారు.

Related image

బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో దీప్తిని ప్లిప్ చేసే విషయంలో నందిని, కౌశల్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీనిపై వివరణ అడిగిన నాని.. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంలో వీడియో క్లిప్‌లను చూపించాడు. దీంతో.. మాట మార్చినట్లు స్పష్టమవడంతో అందరి ముందు కౌశల్ దోషిగా నిలిచాడు. ‘సీజన్ ఆరంభం నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో నువ్వు చెప్పిన మాటలకి.. ఆడిన తీరుకి బయట ఫ్యాన్స్ పెరిగారు. కానీ.. ఇప్పుడు నువ్వు ఇలా మాట మారుస్తుంటే వారి ఆదరణ కోల్పోతావు’ అని కౌశల్‌కి నాని చురకలు అంటించాడు.

Related image

కౌశల్‌కి అలా నాని వార్నింగ్ ఇవ్వడాన్ని ఇష్టపడని కొంతమంది అభిమానులు.. బిగ్‌బాస్ హోస్ట్‌ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. కౌశల్ స్టార్‌డమ్‌ని నానీ జీర్ణించుకోలేకపోతున్నాడని కొందరు, కావాలనే కౌశల్‌ని బ్యాడ్ చేయడానికి నాని ట్రై చేస్తున్నాడని మరికొందరు విమర్శలు గుప్పించారు. ఒక్కరైతే.. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో కంటెస్టెంట్‌ ఓవియా, ఆమె ఫ్యాన్స్ ‘ఓవియా ఆర్మీ’ గురించి ప్రస్తావించారు. గత ఏడాది తమిళ బిగ్‌బాస్ సీజన్‌ 1కి ఓవియా ఓ రేంజ్‌‌లో ఆదరణని తీసుకొచ్చింది. ఇంట్లోని కంటెస్టెంట్స్‌ అంతా ఒకవైపు.. ఆమె ఒక్కతే ఒకవైపు అన్నట్లుగా సీజన్ సగం వరకూ ఆమె హవా కొనసాగింది. చివరికి బిగ్‌బాస్ హౌస్‌లోనే ఆరవ్‌తో ప్రేమలో పడి.. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో.. మధ్యలోనే అర్ధాంతరంగా ఆమెని వెలుపలకి పంపించేశారు.

ఇక త‌నీష్ చేసిన విష‌యాలు ఎందుకు నాని మాట్లాడ‌టం లేదు.. త‌నీష్ దీప్తి సునైనా నందినితో చేస్తున్న ముద్దులు హ‌గ్గుల క్లిప్పింగులు వేయాలి క‌దా, అలాగే నందిని వెదవ అని కౌశ‌ల్ ని సంబోధించిన క్లిప్ వేయాలి క‌దా, దీనికంటే పెద్ద త‌ప్పు కౌశ‌ల్ చేశాడు అని నాని భావిస్తున్నారా అని కౌశ‌ల్ ఆర్మీ నానిని ప్ర‌శ్నిస్తోంది.. ఆ కిస్సులు హ‌గ్గులు వీడియోలు మేము బ‌య‌ట‌పెడతాం అంటూ కామెంట్లు ట్వీట్లు పెడుతున్నారు కౌశ‌ల్ ఆర్మీ.. మ‌రి చూడాలి గ‌తంలో కూడా ఇలాంటి ట్రోల్స్ పై నాని కామెంట్లు చేశారు మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో.

జనసేన లోకి మాజీ మంత్రి..!